- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AI Skills : కంప్యూటర్ సైన్స్ దండగ.. కోడింగ్ వేస్ట్.. AI చేస్తన్న పనికి అంతా మటాష్..!!
ఏఐ (A.I) గురించి తెలియకపోతే.. నేర్చుకోకపోతే.. అవగాహన చేసుకోకపోతే.. జాబ్ రావడం కష్టమని, వచ్చినా ఎక్కువకాలం నిలువడం మరింత కష్టమని చెబుతున్నారు సాంకేతిక నిపుణులు.

దిశ, ఫీచర్స్ : కంప్యూటర్ సైన్స్ చెయ్ బ్రో.. మస్తు జాబ్స్ దొరుకుతయ్.. ఒకప్పుడు క్యాంపస్ ఆవరణల్లో ఏ నలుగురు కలిసినా ఇలాంటి మాటలు తరచుగా వినిపించేవి. ఫలానా కోర్సు చదివితే మంచి చాన్స్ ఉంటుందని కొందరంటే.. ‘కోడింగ్ నేర్చుకుటే జిందగీ బిందాస్ బ్రో’ అని మరికొందరు అంటుండె.. కానీ ఇప్పుడట్లంటే.. ‘ఓర్నీ.. నీకేం తెల్వనట్లుంది.. గవన్నీ ఏం పనికొస్తయ్.. ఏఐ నేర్చుకో బాగుపడతావ్.. వస్తే జాబొస్తది.. లేకుంటే నాలెడ్జ్ వొస్తది’ అంటున్నారు ఆధునికులు కొందరు. అదే సందర్భంలో కొన్ని జాబ్స్ పోవడానికి కూడా ఏఐనే కారణం అవుతున్నదన్న ఆందోళనలు సైతం వ్యక్తం అవుతున్నాయ్. ఆ కోవకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.
గతంలో (దాదాపు పది, పదిహేను ఏండ్ల కిందట కూడా) కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీకి మస్తు డిమాండ్ ఉండె. ఇది చదివి కోడింగ్ నేర్చుకుంటే ఐదంకెల జీతం పక్కా అనే భరోసా ఉండేది చాలా మందికి.. మరిప్పుడో..! ‘నథింగ్.. చెప్పలేం.. దండగ.. వేస్ట్.. ఏఐ ముందు అవన్నీ మటాష్’ అని చమత్కరిస్తున్నారు పలువురు టెక్నాలజిస్టులు. ఈరోజుల్లో ఏఐ (A.I) గురించి తెలియకపోతే.. నేర్చుకోకపోతే.. అవగాహన చేసుకోకపోతే.. జాబ్ రావడం కష్టమని, వచ్చినా ఎక్కువకాలం నిలువడం మరింత కష్టమని చెబుతున్నారు. అందుకే ఏఐ నేర్చుకుంటే పోలా..! అని సలహాలిచ్చేస్తున్నారు నిపుణులు సైతం. పర్డ్యూ, ఓరెగాన్ స్టేట్, జార్జ్‌టౌన్ వంటి యూనివర్సిటీలకు చెందిన కొందరు గ్రాడ్యుయేట్లు సైతం ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
వందలు, వేల సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్నప్పటికీ తిరస్కరణ ఎదురవుతోంది పర్డ్యూ, ఓరెగాన్ స్టేట్, జార్జ్‌టౌన్ వర్సిటీలకు చెందిన గ్రాడ్యుయేట్స్ అంటున్నారు. కారణం ఏఐ స్కిల్స్ లేకపోవడం. ప్రస్తుతం మల్టీనేషనల్ కంపెనీలు, ముఖ్యంగా టెక్ సెక్టార్‌లో అనుభవజ్ఞులైన టెక్ ఇంజినీరింగ్ నిపుణుల కొరత వేధిస్తుండగా.. మరోవైపు ఆధునిక సాంకేతికతపై పట్టున్న ఫ్రెషర్స్ కొరత కూడా మస్తుగానే ఉంటున్నది. ఏఐ వంటి సాంకేతిక నైపుణ్యాలు ప్రధాన అర్హతగా ఉండటంతో అవి ఉన్నవారి మధ్యే ఉద్యోగాల కోసం పోటీ నెలకొంటున్న పరిస్థితులు విదేశాల్లో చూస్తున్నాం. దీంతో సాధారణ గ్రాడ్యుయేట్లు, చివరకు కంప్యూటర్ సైన్స్, కోడింగ్ వంటి డిగ్రీలు, స్కిల్స్ ఉన్నవారు సైతం తిరస్కరణకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోవచ్చు. అదే సందర్భంలో ఈ స్కిల్స్ ఉన్నవారికి ఉద్యోగాల్లో డిమాండ్ పెరగొచ్చు. మొత్తానికి భవిష్యత్ జాబ్ మార్కెట్ అంతా ఏఐ స్కిల్స్ వంటి ఆధునిక సాంకేతికపై ఆధారపడుతుందని నిపుణులు, అనుభవజ్ఞులు అంటున్నారు. ఫైనల్లీ ఏం జరుగుతుందో మరి!!






