Dark Chocolate: డార్క్ చాక్లెట్లను తినే వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు

by Phanindra |   (  Updated:2025-03-09 15:56:06  IST  )

ఒక్కటి తింటే చాలు మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని అంటున్నారు.

Dark Chocolate:  డార్క్ చాక్లెట్లను తినే వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు
X

దిశ, వెబ్ డెస్క్ : అమ్మాయిలు ఎక్కువగా చాక్లెట్ ను తినేందుకు ఇష్ట పడతారు. అయితే, దీని వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక, ఇప్పుడు చాక్లెట్లు తినేవారికి నిపుణులు గుడ్ న్యూస్ చెప్పారు.రోజూ వీటిని తినడం వలన గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయట. ఒక్కటి తింటే చాలు మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని అంటున్నారు. అంతక ముందు చాక్లెట్ల మీద చేసిన పరిశోధనలను .. ఇప్పుడు మరోసారి సమీక్షించిన నిపుణులు శుభవార్తను చెప్పారు.

కొన్ని రకాల చాక్లెట్లలో ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే నల్లని ఉండే చాక్లెట్లలో కోకో ఫ్లేవనాయిడ్లు రక్తం వ్యవస్ధపైన ప్రభావం చూపుతుంది. ఇవి ప్రమాదకరమైన బ్లడ్ లోని గడ్డలను తొలగించి రక్తనాళాలను క్లీన్ చేస్తాయని, అలాగే, శరీరంలో రక్త సరఫరాను మంచిగా చేస్తుందని తెలిపారు. ఫ్లేవనాయిడ్లు చాక్లెట్ తయారీలో ప్రతి బ్యాచ్ కు ఛేంజ్ అవుతుంటాయి. వీటిని తయారు చేసే వాళ్ళు .. లేబుల్స్ వివరాలను చాక్లెట్ పై వేయాలని ఆయన సూచించారు.

మంచి చాక్లెట్ అంటే 70 శాతం కోకో ఉండాలని..అంటే వాటిలో ఫ్లేవనాయిడ్లు ఎక్కువ ఉంటాయని అంటున్నారు.సెంట్రల్ అమెరికాలోని గిరిజనులపై చేసిన పరిశోధనల్లో వారు తినే ఫుడ్ లో కోకో అధికంగా ఉందని, ఇది రక్త కణాలను పెంచి రక్తపోటు, రక్తం గడ్డ కట్టడం, గుండె పోటు, ఇతర గుండె జబ్బులు లేకుండా చేస్తోందని ఆయన వెల్లడించారు. అందువలనే చాక్లెట్ ను మన ఫుడ్ లో ఒక భాగంగా చేయాలని చెబుతున్నారు. అమెరికాలో చేసిన మరో ప్రయోగం కూడా డార్క్ చాక్లెట్లు కంటి సమస్యలను తగ్గించగలదని వెల్లడించింది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృ ధృవీకరించడం లేదు.

Read More : వీటిని తినండి.. కొవ్వు ఐస్‌లా కరిగిపోవాల్సిందే

Next Story