- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొద్దు పొద్దున్న ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్.. మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నాయేమో..!
పొద్దు పొద్దున్న ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్.. మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నాయేమో..!

దిశ, ఫీచర్స్ : ఉదయం లేవగానే తీవ్రమైన అలసటతోపాటు ప్రతిరోజూ నడుము నొప్పి వేధిస్తోందా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే మీ కిడ్నీలు రిస్క్‌లో ఉన్నాయని చెప్పడానికి గల లక్షణాల్లో ఇది కూడా ఒకటి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతోపాటు పక్కటెముకల కింది భాగాన, పొత్తి కడుపులో ఒక వైపున మాత్రమే తరచుగా నొప్పి వంటివి వస్తుంటాయి. ఇంకా ఏయే లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
*తీవ్రమైన నొప్పి : ఉదయంపూట పక్కటెముకలు లేదా వీపు భాగంలో తీవ్రమైన నొప్పి మొదలై అది గజ్జలు లేదా తొడలకు వ్యాపిస్తుంది. అలాగే మధ్య మధ్యలో నొప్పి తీవ్రంగా వచ్చి, కొంత సమయం తగ్గి మళ్లీ రావచ్చు (renal colic).
*యూరిన్‌లో మార్పులు : మూత్రంలో రక్తం (హెమటూరియా) పడటం, రంగు మారడం కూడా కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయనడానికి సంకేతాలు. అలాగే యూరిన్ కలర్ గులాబీ, ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపించవచ్చు. దీంతోపాటు దుర్వాసన కూడా వస్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం లేదా చాలా తక్కువ పరిమాణంలో మూత్రం రావడం కూడా కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని తెలిపే సంకేతాలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
* వికారం, వాంతులు : ఉదయం లేవగానే వికారం, వాంతులు రావడం, జలి జ్వరం వచ్చి కాసేపటి తగ్గడం, మళ్లీ రావడం వంటివి కూడా కిడ్నీల పనితీరు మందగించిందని లేదా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలియజేసే ప్రధాన సంకేతాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే కాళ్లు, చీలమండల భాగాలు, ముఖం లేదా చేతులలో తరచుగా వాపు రావడం కూడా కిడ్నీలు సరిగ్గా పనిచేయడం వల్ల సంభవిస్తుంది.
*నివారణ : కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం లేదా వాటి పనితీరు మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. రోజువారి జీవితంలో తగిన జాగ్రత్తలు, నివారణ చర్యలు అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రోజుకు 2.5-3 లీటర్ల నీరు తప్పక తాగాలి. దీంతో కడ్నీల్లో ఉండే చిన్న చిన్న రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఉప్పు, పాలకూర, బీట్‌రూట్, ప్యూరిన్ (మాంసం, చేపలు) ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినాలి. జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






