- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI in dating : డేటింగ్ విధానాన్ని మార్చేస్తున్న ఏఐ.. మెరుగైన సంబంధాలకు దోహదం చేస్తుందా?

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక అవసరం కోసం దీనిని యూజ్ చేస్తున్నారు. ఇక ఆయా రంగాల్లో దీని ప్రవేశం తర్వాత అనేక పనులు, సేవల నిర్వహణ మరింత సులభతరమైంది. మానవాళికి కంఫర్ట్‌ను అందిస్తోంది. అయితే రోజు రోజుకూ విస్తరిస్తున్న ఈ అధునాతన సాంకేతికత ఇప్పుడు, మానవ సంబంధాలను సైతం ప్రభావితం చేయనున్నదా..? అవుననే అంటున్నారు నిపుణులు. ఆన్‌లైన్ కేంద్రంగా మెరుగైన సంబంధాల నిర్వహణకు సహాయపడుతుందని చెబుతున్నారు. అందుకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ ప్రముఖ డేటింగ్ యాప్ ఫౌండర్ ప్రకారం.. కృత్రిమ మేధస్సు (AI) ప్రస్తుతం డేటింగ్ విధానాన్ని పూర్తిగా మార్చగలదని నమ్ముతున్నారు. అంతేకాకుండా ఒక AI డేటింగ్ కాన్సియర్జ్ అనేది ఆన్‌లైన్ కేంద్రంగా సంబంధాల నిర్వహణలో కీ రోల్ పోషిస్తుంది. డేటింగ్ యాప్‌లు, సైట్లలో అభద్రతాభావాలను అధిగమించడం ద్వారా మెరుగైన సంబంధాల నిర్వహణకు సహాయపడుతుంది. రిలేషన్‌షిప్‌లో మెరుగైన ప్రవర్తనకు మార్గనిర్దేశం చేస్తుంది. స్పష్టమైన కన్వర్జేషన్లకోసైం టిప్స్‌ను అందిస్తుంది. ఇప్పటికే ఈ విధానాల ద్వారా డేటింగ్ విధానాన్ని మెరుగైన దిశగా మార్చిన సందర్భాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
వేలకొద్దీ ప్రొఫైల్స్‌ను స్కాన్ చేయడం ద్వారా ఏఐ అత్యంత అనుకూలమైన కొన్ని మ్యాచ్‌లను సైతం ఎంపిక చేస్తుంది. అంటే ఇది ఆధునిక డేటింగ్‌లో సమయం వృథా కావడాన్ని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా AI సహాయం ద్వారా డేటింగ్ ప్రాసెస్‌లో ఒత్తిడి తగ్గి, ఆరోగ్యకరమైన, అర్థవంతమైన సంబంధాలపై దృష్టి సారించవచ్చు. ఈ వినూత్న విధానం డేటింగ్ అనుభవాన్ని మరింత సమర్థవంతంగా పర్సనలైజ్ చేసేదిగా మారుతుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా లోతైన సంబంధాలను ప్రోత్సహించడంలో ఏఐ ఆధారిత వేదికలు అద్భుతంగా సహాయపడతాయి. ఈ పరిణామం సంబంధాలను మరింత అర్థవంతంగా, సమర్థవంతంగా మార్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. Link






