మనిషికి సహాయపడే మరమనిషి.. ఆ శాస్త్రవేత్తల మరో సాంకేతిక అద్భుతం!

by Javid Pasha |   (  Updated:2026-03-20 10:28:08  IST  )

వివిధ పనుల్లో బరువులు మోసేందుకు మనిషికి సహాయపడే సెంటార్ ప్రేరేపిత రోబోను సాంకేతిక నిపుణులు తయారు చేశారు.

మనిషికి సహాయపడే మరమనిషి.. ఆ శాస్త్రవేత్తల మరో సాంకేతిక అద్భుతం!
X

దిశ, ఫీచర్స్ : వివిధ పనుల్లో కేవలం రోబోలను మాత్రమే ఉపయోగిస్తే మానవులతో అవసరం లేకుండా పోతుంది. ఈ పరిస్థితి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుంది. అందుకే కొందరు సాంకేతిక నిపుణులు మానవులను రోబోలే పూర్తిగా భర్తీ చేయడం కాకుండా.. పనుల్లో వారికి సహాయపడే రోబోలను అభివృద్ధి చేస్తున్నారు. రీసెంట్‌గా చైనాలోని షెన్‌జెన్‌లో గల సౌతెర్న్(Southern) యూనివర్సిటీ ఆఫ్ సైన్స్& టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అదే చేశారు. ఆయా పనుల్లో, ముఖ్యంగా నిర్మాణ పనుల్లో బరువులు మోసేసమయంలో మనిషికి సహాయపడేందుకు ధరించగలిగే సెంటార్ ప్రేరేపిత (centaur-inspired)రోబోను తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఉపయోగాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. అవేమిటో చూద్దామా మరి.

చైనీస్ సాంకేతిక శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన సెంటార్ - ఇన్‌స్పైర్డ్ వియరబుల్ రోబో భారీ పనులు చేసేటప్పుడు మనుషులకు అద్భుతంగా సహాయపడుతుంది. ఎందుకంటే దీనిని మనిషి తన వీపు భాగంలో అమర్చుకోవచ్చు. అప్పుడు మనిషి తను మోయాల్సిన బరువులను సదరు రోబోనే మోస్తుంది. పైగా పనిచేస్తున్నప్పుడు మనిషి శరీరంమీద పడే శ్రమ దీనివల్ల సుమారు 35% తగ్గుతుంది. కాబట్టి మనుషులు గాయపడటం, అలసిపోవడం వంటి పరిస్థితులు దూరం అవుతాయంటున్నారు నిపుణులు. ఇప్పటికిప్పుడు ఇది మార్కెట్లో అయితే అందుబాటులో లేదు. కానీ త్వరలో వచ్చే అకాశం ఉంది. అదే జరిగితే నిర్మాణ సైట్లు, గోడౌన్లు, విపత్తు ప్రాంతాలు(Disaster areas), సైనిక రంగాల్లో పనిచేసేవాళ్లకు ఇది గేమ్ చేంజర్ మారుతుందంటున్నారు నిపుణులు. మనుషులను ఒక్కసారిగా సూపర్ హ్యూమన్‌లుగా మార్చడం కాదు, కష్టమైన పనులను సురక్షితంగా, స్థిరంగా చేయడమే లక్ష్యంగా ఈ సెంటార్ ఇన్‌స్పైర్డ్ రోబోను డెవలప్ చేసినట్టు దాని దానితయారీ దారులు చెబుతున్నారు. అంటే ఇది కేవలం బరువు మోసే టూల్ కాదు, మానవ శ్రమను తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడి, పనిసామర్థ్యాన్ని పెంచే భవిష్యత్ సాంకేతికతగా పేర్కొంటున్నారు.

Next Story