- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Heart Felt Technology : గుండె వైఫల్యాన్ని ముందుస్తుగా గుర్తించే ఫుట్ స్కానర్.. అందుబాటులోకి మరో ఏఐ పరికరం!
Heart Felt Technology : గుండె వైఫల్యాన్ని ముందుస్తుగా గుర్తించే ఫుట్ స్కానర్.. అందుబాటులోకి మరో ఏఐ పరికరం!

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ముందస్తు లక్షణాలను గుర్తించకపోవడం, వాటిపట్ల అవగాహన లేకపోవడం వంటి పరిస్థితులు తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంటాయి. కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ మారుతుంటాయి. హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్ విషయాల్లోనూ చాలా మంది ఇవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఏఐ ఆధారిత(AI based) ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చాక అలాంటి పరిస్థితికి చెక్ పెట్టే మార్గాలు కూడా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం గుండె వైఫల్యాన్ని ముందస్తుగా అంచనా వేసే సరికొత్త టెక్నాలజీ సైతం అందుబాటులోకి వస్తున్నది. అలాంటివాటిలో ఏఐ పవర్డ్ ఫుట్ స్కానర్ కూడా ఒకటి.
అకస్మాత్తుగా గుండెపోటుకు గురైతే, సరైన సమయానికి చికిత్స అందకపోతే.. ప్రాణాలు కోల్పోవచ్చు. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే సమస్యను ముందుస్తుగానే గుర్తించి అలర్ట్ చేసే సాంకేతికతపై అవసరమని భావించిన సాంకేతిక పరిశోధకులు చాలా కాలంగా దాని అభివృద్ధిపై కేంద్రీకరించారు. అందులో భాగంగా కేంబ్రిడ్జ్‌లోని స్టార్టప్ కంపెనీ అయిన హార్ట్ ఫెల్ట్ టెక్నాలజీస్(Heartfelt Technologies) సరికొత్త ఏఐ పవర్డ్ ఫుట్ స్కానర్‌ను డెవలప్ చేసింది. ఈ పరికరం హార్ట్ ఫెయిల్యూర్ రోగులలో ద్రవం పేరుకుపోవడాన్ని(Edema) ముందుగానే గుర్తిస్తుంది. కాబట్టి హృదయ వైఫల్యం సంభవించే అవకాశమున్న రోగులకు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అవసరాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే స్మార్ట్ స్పీకర్ పరిమాణంలో ఉండే ఈ బెడ్ సైడ్ పరికరం రోగి ఆరోగ్య పరిస్థితి విషమించడాన్ని, ముఖ్యంగా గుండె వైఫల్యం సంభవించడాన్ని 13 రోజుల ముందే గుర్తిస్తుంది.






