- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్ : మీరు ప్రస్తుతం ఉన్నచోటు నుంచి.. వేరే ఊరిలోనో, వేరే దేశంలో ఉన్న వ్యక్తితో కమ్యూనికేట్ చేయాలంటే ఏం చేస్తారు? ఆడియో లేదా వీడియో కాల్ మాట్లాడతారు. మరి హగ్ చేసుకోవాలనిపిస్తేనో, షేక్ హ్యాండ్ ఇవ్వాలనిపిస్తేనో ఏం చేస్తారు? రెండవ ప్రశ్నకు సమాధానంగా ఏమీ చేయలేం.. అది సాధ్యం కాదనే అందరూ అనుకుంటారు. కానీ ఇక నుంచి సాధ్యం కావచ్చు. కాకపోతే ప్రత్యక్షంగా హగ్ చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటిది జరగకపోవచ్చు. కానీ అలా చేసుకున్న అనుభూతిని కలిగించే ఒక అద్భుత సాంకేతికతను సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ఇంజినీర్లు డెవలప్ చేశారు. ఈ సూపర్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ రిమోట్ టచ్ ఫీలింగ్‌ను రియల్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. అదెలాగో చూద్దాం.
రిమోట్ టచ్ అంటే..
రిమోట్ టచ్ అంటే దూరంగా ఉన్న వ్యక్తుల మధ్య టచ్ ఫీలింగ్‌ను (హగ్, హ్యాండ్‌షేక్) ఇంటర్నెట్ ద్వారా ట్రాన్స్‌మిట్ చేయడం. హాంకాంగ్‌లో డెవలప్ చేసిన e-skin లాంటి టెక్నాలజీని ఉపయోగించి, ఒకరు టచ్ చేస్తే, మరొకరు మైళ్ల దూరంలో ఉన్నా అదే ఫీలింగ్‌ను అనుభవిస్తారు. ఇది వర్చువల్ రియాలిటీ, టెలిమెడిసిన్, సోషల్ కమ్యూనికేషన్‌లో ఉపయోగపడుతుంది. దీనిని (e-skin)
ఎవరు డెవలప్ చేశారు?
సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ (CityU) బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లోని అసోసియేట్ ప్రొఫెసర్ యూ ఎక్సింగె (Xinge Yu) లీడ్ చేసిన రీసెర్చ్ టీమ్ డెవలప్ చేసింది. ఈ వైర్‌లెస్, సాఫ్ట్ ఎలక్ట్రానిక్ స్కిన్ ఈ స్కిన్(e-skin)ను డెవలప్ చేసింది. ఇది 7 సెం.మీ × 10 సెం.మీ సైజ్‌లో, 4.2 మి.మీ మందంలో ఉండే ఫ్లెక్సిబుల్ ప్యాచ్ లాంటిది. ఇందులో 4×4 యాక్ట్యువేటర్‌లు (సెన్సర్స్ కమ్) ఉన్నాయి.
ఉపయోగాలు ఏమిటి?
*సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌లో డెవలప్ చేసిన సాఫ్ట్ ఎలక్ట్రానిక్ స్కిన్ (e-skin) లేదా ‘Touch IoT’ టెక్నాలజీ వర్చువల్ రియాలిటీ (VR) గేమ్స్, మెటావర్స్ ఎన్విరాన్‌మెంట్స్‌లో రియలిస్టిక్ టచ్ ఫీలింగ్ ఇస్తుంది. ఉదాహరణకు వర్చువల్ హ్యాండ్‌షేక్స్, హగ్స్ లేదా ఆబ్జెక్ట్స్ టచ్ నిజమైన అనుభూతిని కలిగిస్తాయి.
*వివిధ చికిత్సల్లో ఇ-స్కిన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా టెలిమెడిసిన్, రిమోట్ సర్జరీ వంటి వాటిలో డాక్టర్లు రిమోట్‌గా పేషెంట్స్‌ను టచ్ ద్వారా డయాగ్నోస్ చేయవచ్చు. లేదా రోబోటిక్ సర్జరీలో హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ కోసం ఉపయోగపడుతుంది.
*దూరంగా ఉన్న వ్యక్తుల మధ్య డిజిటల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, ప్రియమైన వ్యక్తుల మధ్య రియల్ హగ్స్, టచ్ ఫీలింగ్‌ను ట్రాన్స్‌మిట్ చేస్తుంది. ఎమోషనల్ కనెక్షన్‌ను పెంచుతుంది.
*ఫిజియోథెరపీలో రిమోట్ టచ్ గైడెన్స్ ఇవ్వడానికి లేదా స్ట్రోక్ పేషెంట్స్‌కు టచ్ సెన్సేషన్ రీస్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది.
*సాఫ్ట్ రోబోట్స్‌లో హ్యాప్టిక్ ఇంటర్‌ఫేస్‌గా.. అంటే యూజర్‌కు టచ్, ప్రెషర్, వైబ్రేషన్ లాంటి ఫీలింగ్స్‌ను సిమ్యులేట్ చేస్తుంది. రోబోట్-హ్యూమన్ ఇంటరాక్షన్స్‌ను మరింత నేచురల్‌గా చేస్తుంది.
*రిమోట్ క్లాస్‌రూమ్స్‌లో టీచర్స్ స్టూడెంట్స్‌కు టచ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి, ఉదాహరణకు హ్యాండ్‌రైటింగ్ గైడెన్స్‌కు ఉపయోగపడుతుంది. ఇది 5G/6G నెట్‌వర్క్స్‌తో ఇంటిగ్రేట్ అయితే ఫ్యూచర్‌లో మరిన్ని కొత్త సాంకేతిక అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది.






