Solo Trip : సోలో ట్రిప్‌ సో క్రేజీ గురూ.. మిలీనియల్స్‌లో పెరుగుతున్న ఆసక్తి

by Javid Pasha |
Solo Trip : సోలో ట్రిప్‌ సో క్రేజీ గురూ.. మిలీనియల్స్‌లో పెరుగుతున్న ఆసక్తి
X

దిశ, ఫీచర్స్ : విహార యాత్రలంటేనే అదో ఆనందం. కొంగొత్త ప్రదేశాలు చుట్టి రావచ్చుననే ఉత్సాహం. ఒకప్పుడైతే ఎక్కువగా కుటుంబంతో గానీ, కొలీగ్స్ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి గానీ కలిసి వెళ్లేవారే ఎక్కువగా ఉండేది. ఇక స్కూల్ లేదా కాలేజ్ డేస్‌లో విహార యాత్రలు, విజ్ఞాన యాత్రలు వంటివి సహజమే. కానీ ఇటీవల ‘సోలో ట్రిప్’ ట్రెండ్ ఎక్కువగా పాపులర్ అయింది. స్త్రీ, పురుషులు తేడా లేకుండా ఒంటరి ప్రయాణం చేయాలన్న క్రేజీ మిలీనియల్స్‌లో పెరిగిపోతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒంటరి ప్రయాణాల్లో ఉండే రిస్క్ ఏంటి? బెస్ట్ ఏంటి? ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఇవి ముందే తెలుసుకోండి

మీరు సోలో ట్రిప్‌కు వెళ్లానుకోవడం మీ ఇష్టం. అయితే వెళ్లే ముందు అన్ని విషయాల్లోనూ తగిన కేర్ తీసుకోవాలని, ముందుగానే ప్రిపేర్ కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మీరు వెళ్లబోయే ప్రాంతం ఏది? స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, అక్కడి చట్టాలు ఏమిటి? మీరు ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవచ్చు?, ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలి? ఈ విషయాలపట్ల ఓ అవగాహనకు వస్తే చిక్కుల్లో పడకుండా ఉంటారు. ముఖ్యంగా సోలో ట్రిప్‌కు వెళ్లే మహిళలు ఈ విషయాలతోపాుట సేఫ్టీ గురించి కూడా ఆలోచించాలి.

అడ్వాన్స్ బుకింగ్ మంచిది

సోలోగా ట్రావెల్ చేయాలనుకునే వారు పలు విషయాల్లో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం తర్వాత ఇబ్బందులకు దారితీయవచ్చు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో మరింత జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు. ట్రావెల్ బుకింగ్స్‌తో పాటు మీరు వెళ్లే ప్రాంతంలో ఎన్ని రోజులు స్టే చేయాలనుకుంటున్నారు? అలాగే అక్కడ హోటల్స్, రిసార్ట్స్, లోకల్‌గా జర్నీ చేసేందుకు అవసరమైన ట్రాన్స్‌పోర్టేషన్ ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవడం, వీలైనంత వరకు ముందుగానే బుక్ చేసుకోవడం చేస్తే తర్వాత టెన్షన్ ఉండదు. ఈ విషయంలో ట్రావెల్ ఏజెన్సీలు ప్యాకేజీలు, ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటాయి.

ఫ్యామిలీతో షేర్ చేసుకుంటూ

ఒంటరిగా ప్రయాణించాలనుకున్నప్పుడు ముందుగానే మీరు వెళ్లబోయే పర్యాటక ప్రదేశాల గురించి కుటుంబ సభ్యులతో చెప్పండి. వారు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో కూడా వివరించండి. అలాగే మీరు ట్రిప్‌లో ఉన్నప్పుడు స్టే చేస్తున్న హోటల్స్, ప్రయాణిస్తున్న వెహికల్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు పంచుకోవడం మీ సేఫ్టీలో భాగంగా భావించండి. మహిళలకు ఇది మరింత ముఖ్యం. ఇక బయటకు వెళ్లేటప్పుడు లైవ్ లొకేషన్ మీ ప్రియమైన వారికి, పేరెంట్స్‌కు షేర్ చేయడం ఇంకా మంచిది.

ఫోన్‌లో పూర్తిగా నిమగ్నమైపోకండి

సోలో ట్రిప్ అందరికీ నచ్చక పోవచ్చు. కానీ కొందరికి ఇదే ఆనందాన్నిస్తుంది. కాబట్టి విహార యాత్రలకు ఒంటరిగా వెళ్లేవారు తమ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. అవసరమైతే కుటుంబంతో, సన్నిహితులతో మీ ట్రిప్ గురించి వివరంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ఇక మహిళలైతే తమకు కంఫర్ట్‌గా ఉండే డ్రెస్‌లను ఎంచుకోవాలి. జర్నీలో ఉండగానో, ఆయా ప్రదేశాల్లో విహరిస్తున్నప్పుడో పూర్తిగా ఫోన్‌లో నిమగ్నమై పోవద్దు. చుట్టు పక్కల పరిసరాలపై ఓ కన్నేసి ఉంచండి. ఈ రోజుల్లో దొంగలు, నేరస్థులు ప్రతీచోటా ఉంటున్నారు. కాబట్టి గోల్డ్, మనీ వంటివి జాగ్రత్త. వాటిని లాకర్స్‌లో పెట్టుకోవడం మంచిది. అలాగే మిమ్మల్ని డైవర్ట్ చేసే విషయాల జోలికి, వ్యక్తుల జోలికి వెళ్లవద్దు. హోటల్స్, వెహికల్స్ బుక్ చేసే ముందు, చేశాక అవి సేఫ్టీనో కాదో అని కూడా ఒకసారి ఆలోచించడం మర్చిపోవద్దు.

స్కామర్లతో జాగ్రత్త

విదేశాలకు వెళ్లే ఇండియన్స్ అయినా, విదేశాల నుంచి ఇక్కడికి ట్రిప్‌కి వచ్చేవారైనా కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఉదాహరణకు ఢిల్లీలోని చాందినీ చౌక్ వంటి అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కేర్ తీసుకోవాలి. అలాగే ముంబైలోని నిర్మానుష్య ప్రాంతాలకు కూడా ఒంటరి ప్రయాణం అంత సేఫ్ కాదంటారు నిపుణులు. రాజస్థాన్‌లో అయితే టూరిజం పేరుతో అనేక స్కామ్‌లు జరుగుతుంటాయని చెప్తారు. అలాగే నార్త్ ఈస్ట్‌లో ట్రావెల్ చేసేవారు అక్కడి పరిస్థితులు, భద్రతా పరమైన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

అపరిచితులతో జాగ్రత్త

విహార యాత్రలైనా, మరేదైనా ఏ ప్రాంతానికి వెళ్లినా మిమ్మల్ని తప్పుదారి పట్టించే వ్యక్తులతో, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అట్లనే మీరు ఏ ప్రాంతానికి వెళ్లినా లోకల్ లాంగ్వేజ్, సంస్కృతి, సంప్రదాయాలు, డ్రెస్ కోడ్, ఆహారపు అలవాట్లు వంటివి ముందుగానే తెలుసుకుంటే ఏది అవసరమో, ఎలాంటి కేర్ తీసుకోవాలో ఈజీగా అర్థమైపోతుంది. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు సోలో ట్రిప్ హ్యాపీగా, సేఫ్‌గా పూర్తి చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

Next Story

Most Viewed