- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral : మీరు వయసులో చిన్నవారైనా.. అక్కడ ఆంటీ, అంకుల్ అనే పిలవచ్చు..!
దక్షణాఫ్రికాలోని కొన్ని సంస్కృతులలో తమకంటే చిన్న వయసు గలవారిని కూడా ఆంటీ, అంకుల్ అని పిలువడం గౌరవ ప్రదమైన సూచిక.

దిశ, ఫీచర్స్ : మీరెప్పుడైనా గమనించారా? కొంతమంది పురుషులు తమకు 50 ఏండ్లు పైబడినప్పటికీ ఎవరైనా పిల్లలు ‘అంకుల్’ అని పిలిస్తే తెగ ఫీలవుతారు? నేనేమైనా ముసలాడినా.. అంటూ విసుక్కుంటారు. ఇక మహిళలైతే మరింత ఎక్కువ ఫీల్ అవుతుంటారు. ‘ఏంటి నేను ఆంటీ’లా కనిపిస్తున్నానా! అంటూ బాధపడినంత పనిచేస్తారు. ఇంకోసారి అలా పిలవ కూడదని చెబుతుంటారు. ఇండియాలో.. ముఖ్యంగా నగరాల్లో ఇలా ఫీలయ్యేవారే ఎక్కువ. కానీ దక్షణాఫ్రికా, అలాగే ఇతర ఆఫ్రికన్, ఆగ్నేయాసియా సంస్కృతులతో మాత్రం ఇందుకు భిన్నం. అక్కడ తమకంటే వయసులో పదేండ్లు చిన్నవాళ్లను, అలాగే పెద్ద వాళ్లను ఆంటీ, అంకుల్ అని పిలవొచ్చు. పైగా అలా పిలవడం, పిలిపించుకోవడం గౌరవానికి సూచిక. అదెలాగో చూద్దాం.
సాధారణంగా అంకుల్, ఆంటీ అని పిలిపించుకోవడానికి మన దగ్గర అయితే ఎవరూ ఇష్టపడట్లేదు. 60 ఏండ్లు దాటిన వారు కూడా అన్న, అక్క, బ్రదర్ అంటూ ఏదో ఒక వరుసతోనో, పేరు పెట్టో పిలిస్తే తెగ హ్యాపీ ఫీలవుతారు. పురుషులైతే అంకుల్ తప్ప వేరే ఏదైనా పిలవాలని, మహిళలైతే ఆంటీ అని తప్ప ఏ వరుసతోనైనా పిలవాలని చెబుతుంటారు. దక్షణాఫ్రికాలోని కొన్ని సంస్కృతులలో మాత్రం ఇందుకు భిన్నంగా వయసులో జస్ట్ పదేండ్ల ఏజ్ గ్యాబ్ ఉన్నవారిని కూడా ‘అంకుల్, ఆంటీ’ అని పిలుస్తారు. ముఖ్యంగా యుక్త వయస్కులే కాదు, పెద్దలు కూడా తమకంటే పదేండ్ల చిన్నవారైన వారిని కూడా అంకుల్, ఆంటీ అని పిలుస్తుంటారు. ఎందుకిలా? అంటే ఇక్కడ ఇదొక గౌరవ ప్రదమైన పిలుపు. మర్యాద పూర్వక సంస్కృతి. ముఖ్యంగా బ్రాయ్ (బార్బెక్యూ) వంటి సామాజిక సమావేశాల్లో ఇలా పిలువడం ప్రేమ, గౌరవం, మర్యాదకు ప్రతీకగా భావిస్తారు.
ఎలా వచ్చింది?
దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో వయసుతో సంబంధం లేకుండా ఆంటీ, అంకుల్ అని పిలవడం వెనుక హిస్టారికల్ బ్యాగ్రౌండ్ ఉంది. ముఖ్యంగా జూలు, ఎక్సోసా, సోతో వంటి బ్లాక్ ఆఫ్రికన్ గ్రూప్స్‌లో ఇది ‘Village Raises a Child’ అంటే గ్రామం పిల్లలను పెంచుతుంది అనే థియరీ నుంచి వచ్చింది. కుటుంబ సభ్యులు కాని ఇతర పరిచయస్తులను, చుట్టు పక్కల వారిని పురుషులైతే మలుమే(అంకుల్) అని, మహిళలైతే మామానే(ఆంటీ) అని పిలవడం ట్రెడిషనల్. ఇది సమాజాన్ని ఫ్యామిలీలా భావించే మర్యాద పూర్వ సంస్కృతికి నిదర్శనం. అందుకే వయసుతో సంబంధం లేకుండా ఆంటీ, అంకుల్ అని పిలుస్తారు.






