- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Everyday things : సాధ్యం కావనుకున్నవీ సక్సెస్ అవుతాయ్!!

దిశ,ఫీచర్స్ : ఫలానా పని మనవల్ల కాదని మీకెప్పుడైనా అనిపించిందా?.. ఏదైనా ఒక విషయంపట్ల అదెప్పటికీ సాధ్యం కాదనే స్థిరమైన ఆలోచనతో ఉన్నారా? అయితే మీ ఓపీనియన్ మార్చుకోవాల్సిందే! ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా విషయాలు సాధ్యం అయ్యేవే ఉంటాయని, కాకపోతే అప్పటి పరిస్థితులు వాటికి అనుకూలంగా ఉండకపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. మనం ఇంపాజిబుల్ అనుకునే కొన్ని విషయాలు వనరులు, పరిస్థితులు, కాలానుగుణ మార్పులతో ముడిపడి ఉంటాయి. అవన్నీ అనుకూలిస్తే.. అవి కూడా పాజిబుల్ కావచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే కరెక్ట్ అనుకుంటామో కొంతకాలం తర్వాత అది తప్పు కావచ్చు. ప్రస్తుతం మనం ఏదైనా తప్పు అనుకుంటామో కాలం గడిచే కొద్దీ అదే ఒప్పు కావచ్చు. అలాగే చరిత్రలో కూడా మానవులు తమకు సాధ్యం కావనుకున్న అనేక విషయాలు సాధ్యమయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు. అవేమిటో చూద్దాం.
ఫ్యాషన్, మనీ, ఎంజాయ్‌మెంట్
ఒకప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అని భావించిన వాటినే.. నేడు మనం మోడర్న్ స్టైల్‌గా పరిగణిస్తున్నాం. కాకపోతే అవి కొత్తరూన్ని సంతరించుకొని ఉండవచ్చు. ఉదాహరణకు చినిగిన బట్టలు వేసుకోవడం ఒకప్పుడు పేదరికానికి నిదర్శనంగా భావించిన మనం.. నేడు అవే చిరిగిని జీన్స్‌ని లేటెస్ట్ ఫ్యాషన్‌గా పరిగణిస్తున్నాం. ఒకప్పుడు చేతిలో నగదు లేకుండా ఏదీ కొనలేమని, ఎక్కడికీ వెళ్లలేమని భావించే వాళ్లం. కానీ ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కార్డ్ దానిని సాధ్యం చేస్తోంది. అంటే డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు గీకేస్తు్నాం కదా! పాత రోజుల్లో ఎంజాయ్‌మెంట్ కోసం తప్పక బయటకు వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు కూర్చు్న్నచోటే మొబైల్ ఫోన్లో సైతం నచ్చిన సినిమాలు, వీడియోలు చూస్తున్నాం. ఒక వ్యక్తితో మాట్లాడాలనుకుంటే అతన్ని వెతుక్కుంటే వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు ఒక్కఫోన్ కాల్ చాలు.
అతీత శక్తి, ఆధునిక రూపం
ఈరోజుల్లో సంగీతాన్ని, నచ్చిన పాటలను, సినిమాలను గాలి తరంగాల టెక్నిక్‌తో వింటూ, చూస్తూ ఎంజాయ్ చేయగలుగుతున్నాం. కానీ పాతకాలంలో ఎవరైనా చూశామని చెప్తే వారికేవో అతీత శక్తులు ఉన్నాయని, మంత్ర విద్య వస్తుందని భావించేవారు. మాంత్రికులు చేతిలోని దండాన్ని తిప్పుడూ గాలి నుంచి అదృశ్య శక్తిని వశపర్చుకున్నట్లు భ్రమను కల్పించేవారు. కానీ ఈరోజు అలాంటి ఊహలను, భ్రమలను వాస్తవ రూపంలో చూడగలుగుతున్నాం. ఆరోజుల్లో ఇరుగు పొరుగు వారితో తప్ప ఇతర గ్రామాల్లో, దేశాల్లో ఉండేవారితో సంబంధాలు ఉండకపోయేది. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో కాంటాక్ట్ అవడానికి జస్ట్ ఒక్క ఫోన్ కాల్, ఇంటర్నెట్ చాలు.
నిప్పు నుంచి ఫ్లాష్ డ్రైవ్‌ల వరకు
ఓ పదీ పదిహేనేళ్ల కిందట చుట్టలు, బీడీలు, సిగరెట్లు వెలిగించడానికి చాలామంది పొలాలవద్ద కట్టెలకు నిప్పును వెలిగించే వారు. ఆ తర్వాత అగ్గిపెట్టెలు వచ్చాయి. ప్రస్తుతం లైటర్లు, యూఎస్‌బీ ఫ్లాష్ డ్రైవ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లో నిప్పుతో ఏదైనా మండించనిదే వెలగించడం అసాధ్యం అనుకున్నారు. కానీ ఇప్పుడు సాధ్యమే. దశాబ్దం కిందట టీవీలను యూజ్ చేసే తీరు వేరుగా ఉండేది. గత కార్యక్రమాలు వీక్షించాలంటే రికార్డింగ్ షోలు, క్యాసెట్ల ద్వారా వినోదాన్ని ఆస్వాదించేవారు. యాడ్స్‌ను స్కిప్ చేసే పరిస్థితి ఉండేది కాదు. నచ్చిన మూవీస్ చూసుకోవడం కుదిరేది కాదు. కానీ ప్రస్తుత రోజుల్లో అంతా రివర్స్. ఒక్క బటన్ నొక్కితే చాలు నచ్చింది చూడవచ్చు. రిమోట్ ద్వారా నచ్చిన చానెల్ పెట్టుకోవచ్చు.
నీళ్లు అమ్మలేం.. ఆకాశంలో ఎగరలేం
పాతకాలంలో నీరు కేవలం తాగడానికి, వాడుకోవడానికి తప్ప అది ఇతరులకు అమ్మగలిగిన వస్తువు లేదా సరుకు కాదు. ఇతరులకు నీళ్లు ఇచ్చినందుకు లేదా ఇతరుల బావుల్లో, ఇండ్లల్లో నుంచి వాటర్ తెచ్చుకున్నందుకు ఎటువంటి చెల్లింపులు అవసరం లేదు. నీళ్లకోసం డబ్బు చెల్లించడం, ప్రతిఫలంగా ఏదైనా వస్తువు ఇవ్వడం పిచ్చి ఆలోచనగా చూసేవారు. కానీ ఈ రోజుల్లో అది న్యాయం. వాటర్ బాటిళ్లను అమ్మడం, కొనడం కామనై పోయింది. ఇకప్పుడు మనుషులు ఆకాశంలోకి వెళ్లడం అసాధ్యం అనుకునేవారు. కానీ ఇప్పుడు రోవర్లను, రోబోట్‌లను పంపగలుగుతున్నారు శాస్త్రవేత్తలు.
వర్చువల్ జాబ్స్
రెండు దశాబ్దల క్రితం ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ఉద్యోగం చేయడమనేది అస్సలు సాధ్యమయ్యే పని కాదు. పదేండ్ల కిందట కూడా కాగితంపై రాయాల్సిన పనులకు సంబంధించి రిజిష్టర్లు ఇంటికి తీసుకెళ్లి రాసుకొని వస్తామంటే.. ఆశ్చర్యంగా చూసేవారు. కానీ ఇప్పుడు మీరు ఇంటిలో ఉండి పనిచేసేయవచ్చు. ఆన్‌లైన్ బేస్ ఉద్యోగాలు చాలా వరకు వర్క్‌ఫ్రమ్ హోం చేస్తున్నాం. ఇంటినే ఆఫీసుగా మార్చేస్తున్నాం. వర్చువల్‌గానూ మీటింగ్‌లకు అటెండ్ అవుతున్నాం. గతంలో టీవీలను, కంప్యూటర్లను చూసి చాలా పెద్దగా ఉన్నవి. ఎక్కడికైనా వెళ్లినప్పుడు వెంట తీసుకుపోయేలా ఉంటే బాగుండేదని అనిపించినా సాధ్యం అయ్యేది కాదు. కానీ ఈరోజుల్లో జేబుల్లో పెట్టుకొని లేదా చేతికి ధరించే స్మార్ట్ వాచ్ రూపంలోనూ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం. అలాగే కుక్కలను డాగీ డే కేర్‌కి పంపడం, వాటిని వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు వ్యక్తులను నియమించుకొని జీతం ఇవ్వడం, ఓలా ఉబెర్ వంటి టాక్సీల్లో, అలాగే బైక్ రైడింగ్‌లలో గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి ప్రయాణించడం ఒకప్పుడు ఆశ్చర్యంగా, అసాధ్యమైనవిగా అనిపించేవి. ఇప్పుడు అవన్నీ సాధ్యమే. అందుకే మనం ఇంపాజిబుల్ అనుకున్నవి.. పాజిబుల్ కావని చెప్పలేం. మనం తప్పు అనుకున్నది కూడా అందరి దృష్టిలోనూ తప్పని భావంచలేం. అందుకు రివర్స్‌గా జరగొచ్చు.






