కొన్ని జ్ఞాపకాలను మనం ఎందుకు మర్చిపోతామో తెలుసా..? ప్రతీ రాత్రి జరిగేది ఇదే..

by Javid Pasha |   (  Updated:2025-06-23 13:10:15  IST  )

కొన్ని జ్ఞాపకాలను మనం ఎందుకు మర్చిపోతామో తెలుసా..? ప్రతీ రాత్రి జరిగేది ఇదే..

కొన్ని జ్ఞాపకాలను మనం ఎందుకు మర్చిపోతామో తెలుసా..? ప్రతీ రాత్రి జరిగేది ఇదే..
X

దిశ,ఫీచర్స్ : ప్రతీ మనిషికి కొన్ని మరచిపోలేని జ్ఞాపకాలో, సంఘటనలో ఎదురవుతుంటాయి. వీటిలో కొన్నింటిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. మరికొన్నింటిని మర్చిపోతుంటారు. అలా మర్చిపోయే కేటగిరీలో ఉండేవి పెద్దగా ఆసక్తి లేనివై ఉంటాయని ఒక అధ్యయనం పేర్కొన్నది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఆసక్తి లేని వ్యక్తులను, విషయాలను, అనుభవాలను, జ్ఞాపకాలను మనుషులు ఎందుకు మర్చిపోతారు?

జీవితంలో ప్రతీది గుర్తుండకపోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. రీసెంట్ స్టడీ ప్రకారం.. నిద్రపోతున్నప్పుడు మెదడులో జరిగే ప్రక్రియే ఇందుకు దోహదం చేస్తుంది. అంటే మీ మెదడు అవసరం లేని చిన్న విషయాలను, ఆసక్తిలేని లేదా అనవసరమైన జ్ఞాపకాలను తొలగించడంలో నిరంతరం పనిచేస్తుంది. ఈ ప్రాసెస్‌ను ‘సినాప్టిక్ ప్రూనింగ్’ అంటారు. ఇది వ్యక్తుల మెదడు ముఖ్యమైన విషయాలుగా భావించే విషయాలు, నైపుణ్యాలు, అనుభవాలు, జ్ఞాపకాలకోసం స్పేస్ క్రియేట్ చేసే విధానం. పైగా ఈ ప్రక్రియ మెదడు సమర్థతను పెంచుతూ, అవసరమైన సమాచారాన్ని సులభంగా నిల్వ చేయడానికి కూడా సహాయపడుతుంది.

ఆసక్తిలేనివి లేదా అవసరం లేనివని మీరు భావించే అంశాలను మెదడు తొలగించడాన్ని సినాప్టిక్ ప్రూనింగ్( Synaptic Pruning)గా పరిశోధకులు చెబుతున్నారు. ఇది మెదడులోని న్యూరాన్‌ల మధ్య అనవసరమైన సినాప్సెస్‌ను తొలగిస్తుంది. ముఖ్యంగా REM (ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్) దశలో, గాఢమైన నిద్రలో రోజంతా సేకరించిన సమాచారాన్ని మెదడు విశ్లేషిస్తుంది. ఈ సందర్భంలోనే మీకు ఆసక్తిలేని జ్ఞాపకాలను డిలీట్ చేసేస్తుంది. ముఖ్యమైనవాటిని గుర్తుండిపోయేలా బలోపేతం చేస్తుంది. కాగా ఈ ప్రక్రియ బాల్యంలో మరింత ఎక్కువగా జరుగుతున్నప్పటికీ, జీవితాంతం కూడా కొనసాగుతుందని అధ్యయనం స్పష్టం చేసింది. అందుకే మీరు ముఖ్యమైనవని భావించే విషయాలపట్ల ఆసక్తి పెంచుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.

Link

Next Story