గురుత్వాకర్షణ శక్తి పనిచేయని ప్రదేశాలను ఎప్పుడైనా చూశారా..

by Batti.Sumithra |

భూమి గురుత్వాకర్షణ శక్తి గురించి చిన్నప్పుడు మనం చదివే ఉంటాం.

గురుత్వాకర్షణ శక్తి పనిచేయని ప్రదేశాలను ఎప్పుడైనా చూశారా..
X

దిశ, వెబ్‌డెస్క్ : భూమి గురుత్వాకర్షణ శక్తి గురించి చిన్నప్పుడు మనం చదివే ఉంటాం. ఈ గురుత్వాకర్షణ వల్ల ఏదైనా వస్తువును పైకి విసిరేస్తే అది నేరుగా నేలపైకి పడిపోతుంది. కానీ భూమిపైన ఉన్న కొన్ని ప్రదేశాల్లో భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నా కానీ అస్సలు పనిచేయదు. అక్కడి వస్తువులు కూడా నేలను తాకకుండా గాలిలో తేలుతూ ఉంటాయి. ఏంటి ఇది నమ్మబుద్ది కావడం లేదా.. కానీ అది నిజం. మరి ఇంతటి విచిత్రమైన ప్రదేశాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం..

1. ఒరెగాన్ వోర్టెక్స్, అమెరికా..

ఒరెగాన్ వోర్టెక్స్ ఈ ప్రాంతం గోల్డ్ హిల్‌లో ఉన్న ఒక మిస్టీరియస్ ప్రదేశం. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి పని చేయడం లేదని 1930వ సంవత్సరంలో పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాన్ని అమెరికన్లు నిషేధించారు. ఈ ప్రాంతంలో ఉండే మిస్టీరియస్ నిర్మాణాలను చూస్తే ఆశ్చర్యంగా ఉంటాయి. ఇక్కడి పురాతన ఇంటిని చూస్తే ఒకవైపున ఒరిగి ఉంటాయి. ఇక్కడకి వెళ్లిన జనాలు నడుస్తుండగానే పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో గురుత్వాకర్షన శక్తి పనిచేయకపోవడం వలన కాళ్లు గాల్లో తేలుతాయి. అలాగే ఈ ప్రాంతానికి వెళ్లిన సందర్శకులు ముందుకు ఒరిగినట్టు కనిపిస్తారు. అక్కడి ఒరిగిన చెక్క ఇంటిని చూసేందుకు ప్రతి ఏడాది వేల సంఖ్యలో సందర్శకులు వస్తారు.

2. గ్రావిటీ హిట్, అర్మేనియా..

గ్రావిటీ హిట్ అనే ప్రదేశం అర్మేనియా, టర్కీ సరిహద్దులో ఉంది. ఇక్కడి వింత ఏంటంటే కారును ఎవరైనా న్యూట్రల్‌ లో పెట్టినా అది మాత్రం ఆటోమేటిక్‌గా పైకి వెళ్తుంది. ఈ విచిత్రాన్ని చూసేందుకు వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అంతే కాదు ప్రాంతంలోని కొండలో ఉన్న నది కూడా పైకి ప్రవహిస్తుంది.

3. క్యాకిడియో పగోడా, మయన్మార్..

ఈ ప్రదేశం బర్మాలో ఉన్న బౌద్ధ ప్రార్థనా స్థలం. దీన్ని గోల్డెన్ మౌంటెన్‌గా కూడా పిలుస్తారు. 2,500 ఏళ్లుగా ఒక్కటే స్థలంలో ఉన్న బంగారు రంగు కొండ ఒక్కసారిగా పడిపోయినట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి పని చేయకపోవడం వల్లనే ఆ కొండ అలా ఉందని స్థానికుల నమ్మకం.

4. ది మిస్టీరియస్ రోడ్, దక్షిణ కొరియా..

దక్షిణ కొరియాలోని జెజులోని ది మిస్టీరియస్ రోడ్డు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ రోడ్డుపై ప్రయాణించే కార్లు, ఇతర వస్తువులు పైకి లేస్తూ ప్రయాణం చేస్తాయి. ఈ ప్రాంతంలో కూడా గురుత్వాకర్షణ శక్తి పని చేయకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని చెబుతారు.

5. మాగ్నెటిక్ హిల్, ఇండియా..

ఇండియాలోని లేహ్-కార్గిల్ హైవే నుంచి 30 కి.మీ. దూరంలో మాగ్నెటిక్ హిల్ ఉంది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో కూడా గురుత్వాకర్షణ పనిచేయకపోవడం వలన ఇంజన్ ఆఫ్ లో ఉన్న కార్లు వాటికవే పైకి వెళ్తాయి. ఈ వింతను వీక్షించడానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.

6. హడ్సన్ బే ఏరియా, కెనడా..

కెనడాలోని హడ్సన్ బే ప్రాంతంలో కూడా గురుత్వాకర్షణ శక్తి పూర్తిగా పనిచేయదు. అందుకే ఇక్కడి ప్రజలు వారు ఉండే అసలు బరువు కన్నా తక్కువ బరువుగా ఉంటారట.

7. మాగ్నెటిక్ హిల్, కెనడా..

కెనడాలో ఉండే మాగ్నెటిక్ హిల్ కారణంగా అక్కడి వాహనాలు కానీ, వస్తువులు కానీ పల్లంలో కిందికి వెళ్లకుండా పైకి వెళ్తుంటాయి. ఇక్కడ కూడా గురుత్వాకర్షణ శక్తి పని చేయదని చెబుతారు.

Next Story