- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మితమైన మద్యపానం కూడా హానికరమే.. మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది!
రోజుకు ఒక బీరు లేదా ఒక గ్లాస్ వైన్ తాగినా మెదడులోని గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ రెండింటిలోనూ తగ్గుదల కనిపించినట్లు పరిశోధకులు కనుగొన్నారు.

దిశ, ఫీచర్స్ : మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదు కానీ.. మితంగా తీసుకోవడం పెద్ద ప్రమాదమేమీ కాదు అంటుంటారు కొందరు. అయితే యూకే బయో బ్యాంక్ నుంచి వెలువడిన తాజా పరిశోధన మాత్రం మితం కూడా ప్రమాదకరమేనని తేల్చింది. రోజుకు ఒక బీరు తాగినా, ఒక గ్లాస్ వైన్ తీసుకున్నా డేంజరేనని, ఇవి మెదడు పరిణామాన్ని, సామర్థ్యాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నది. ఇందుకు సంబంధించిన వివరాలు నేచర్ కమ్యూనికేషన్ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి.
పరిశోధనలో భాగంగా 36,678 మంది మధ్యవయస్కుల, వృద్ధుల మద్యపాన అలవాట్లను, ఆరోగ్యంపై వాటి ప్రభావానికి సంబంధించిన డేటాను నిపుణులు విశ్లేషించారు. ఈ సందర్భంగా వారు రోజుకు ఒక బీరు లేదా ఒక గ్లాస్ వైన్ తాగుతున్న వారిలో కూడా మెదడులోని గ్రే మ్యాటర్ (ఆలోచనలకు సంబంధించిన భాగం), అలాగే వైట్ మ్యాటర్ (సమాచార ప్రసారానికి సంబంధించిన భాగం) రెండింటిలోనూ తగ్గుదల కనిపించినట్లు కనుగొన్నారు. ముఖ్యంగా జ్ఞాపక శక్తికి కీలకభాగమైన మెదడులోని హిప్పోక్యాంపస్ ఆల్కహాల్ వల్ల ప్రభావితం అవుతుందని గుర్తించారు. అంతేకాకుండా మద్యం ఒక శక్తివంతమైన న్యూరోటాక్సిన్‌గా పనిచేసి, న్యూరాన్ల చివరల్లో ఉండే డెండ్రైట్‌లను దెబ్బతీస్తుంది. మెదడు అంతర్గత సమాచార ప్రసారాన్ని అడ్డుకుంటుంది. కాగ్నిటివ్ డిక్లైన్ & బ్రెయిన్ ఫాగ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. దీంతోపాటు మితంగా తాగినా, అధికంగా తాగినా మద్యం మెదడు వృద్ధాప్యాన్ని, శారీరక వృద్ధాప్యాన్ని కూడా త్వరగా వచ్చేలా ప్రేరేపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.






