- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఔత్సాహిక మహిళలు అన్నింటా ప్రతిభ చాటుతున్నారు!!
ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యే పరిస్థితులు అధికంగా ఉండేవి.

దిశ, ఫీచర్స్: ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యే పరిస్థితులు అధికంగా ఉండేవి. కానీ ఇప్పుడు రోజులు మారాయి. అవకాశం ఉండాలే గానీ ఆధునిక మహిళలు అన్ని రంగాల్లోనూ ప్రతిభ చాటగలరు అనడానికి ఆధారాలున్నాయి. ప్రస్తుతం ఆయా రంగాల్లో రాణించిన, రాణిస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ నిపుణుల్లో మహిళలు కూడా ఉంటున్నారు.
మారుతున్న దృక్కోణం..
ఈ రోజుల్లో పారిశ్రామిక, వ్యాపార దృక్కోణాలు మారుతున్నాయి. సాంప్రదాయ పద్ధతులపట్ల వైఖరి కూడా మారుతోంది. ఒకప్పటిలా మహిళలను తక్కవ అంచనా వేసే పరిస్థితి లేదు. బిజినెస్, రాజకీయ సంబంధిత ప్రణాళికల రూపకల్పనలో, మెరుగైన భవిష్యత్తును అంచనా వేయడంలో మహిళలు సమర్థవంతంగా పని చేయగలుగుతున్నారు. ఈరోజుల్లో మహిళలు నాయకులుగా, పాలకులుగా, నిర్ణయాధికారులుగా ఎదుగుతున్నారు. వారి తెలివితేటలు, పట్టుదల, అంకితభావం, సృజనాత్మకతల కారణంగా దేశ ఆర్థిక పురోగతిలో కూడా సానుకూల మార్పులు సాధ్యం అవుతున్నాయి.
సాంకేతిక నిపుణులుగా మహిళలు..
టెక్నాలజీ సెక్టార్‌లోనూ మహిళలు ప్రతిభ చాటుతున్నారు. తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. అత్యున్నత స్థానాలు అధిరోహించి బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నారు. మహిళలంటే అసమర్థులనే భావన కలిగిన వారి అహాన్ని దెబ్బతీసేలా నేటి మహిళలు సాంకేతిక రంగంలో ప్రతిభ చాటుతున్నారు. అలాగే రాజకీయ రంగంలో అడుగుపెట్టి.. ఊయలని ఊపే చేతులు ప్రపంచాన్ని పరిపాలించగలని చాటి చెబుతున్నారు.
టెక్ ఇండస్ట్రీలో..
ఇక టెక్ ఇండస్ట్రీ విషయానికి వస్తే గొప్ప ప్రతిభను చాటుతున్నప్పటికీ అక్కడ పురుషాధిక్యతను, ఆధిపత్యం కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. టెక్ ఇండస్ట్రీలు చాలా వరకు పురుషుల ఆధిపత్యంలోనే కొనసాగుతున్నాయి. అయినప్పటికీ మహిళలు లేకుండా అవి నడవలేవు. ఇక్కడ మహిళల ప్రతిభా పాటవాలే ఆర్థికవృద్ధికి దన్నుగా నిలుస్తున్నాయి. గతంలో టెక్ డొమైన్‌లో మహిళల ప్రాతినిధ్యం తక్కవుగా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. అనేక రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం వర్క్ ప్లేస్‌లలో జెండర్ డైవర్సిటీ అనేది వ్యాపార, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతోంది. మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల పాత్ర ప్రశంసనీయంగా ఉంటోంది.






