Layoffs: 25 ఏళ్ల ఉద్యోగం ఒక్కరోజే ఊడింది.. బర్త్‌డే నాడే జాబ్ పీకేశారని భార్య ఎమోషనల్‌ పోస్ట్.!!

by Vennela |

Layoffs: ఈ మధ్యకాలంలో బడా కంపెనీలు పెద్దెత్తున ఉద్యోగులను తొలగిస్తూ వారికి షాకిస్తున్నాయి.

Layoffs: 25 ఏళ్ల ఉద్యోగం ఒక్కరోజే ఊడింది.. బర్త్‌డే నాడే జాబ్ పీకేశారని భార్య ఎమోషనల్‌ పోస్ట్.!!
X

దిశ, వెబ్ డెస్క్: Layoffs: ఈ మధ్యకాలంలో బడా కంపెనీలు పెద్దెత్తున ఉద్యోగులను తొలగిస్తూ వారికి షాకిస్తున్నాయి. ఎన్నోఏళ్లుగా ఎంతో విశ్వాసంగా పనిచేసిన వారికి కూడా ఇంటికి పంపిస్తున్నాయి. ఇలాంటి సడన్ లేఆఫ్స్ చాలా మందికి హార్ట్ బ్రేకింగ్ ను కలిగిస్తున్నాయి. తాజాగా ఓ ఘటనలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో 25ళఏళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తన 48వ పుట్టినరోజు నాడే ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ నిర్ణయం ఓ మేనేజర్ కాకుండా, కంప్యూటీర్ అల్గారిథం తీసుకోవడం మరింత బాధాకరమని చెప్పవచ్చు. దీంతో కలిగిన మానసిక క్షోభను అతని భార్య లింక్డ్ ఇన్ లో షేర్ చేశారు.

మైక్రోసాఫ్ట్ లో 25ఏళ్లుగా ఎంతో విధేయతతో కష్టపడి పనిచేసిన తన భర్తను ఓ ఆటోమేటెడ్ సిస్టమ్ ర్యాండమ్ గా లేఆఫ్ క ో్సం సెలక్ట్ చేసిందంటూ ఆమె వాపోయింది. అతన్ని ఉద్యోగం లో నుంచి తీసివేశారు. ఓ కంప్యూటీర్ అల్గారిథమ్ గుడ్డిగా సెలక్ట్ చేసేసింది. ఈ శుక్రవారమే అతని లాస్ట్ వర్కింగ్ డే. అది అతని 48వ పుట్టినరోజు అంటూ తన పోస్టులో పేర్కొంది. తన భర్త ఆటిజంతో బాధపడుతున్నాడని..మల్టిపుల్ స్క్లే రోసిస్ కూడా ఉందని..అయినా ఈ ఆరోగ్య సమస్యలు ఏనాడూ తన పనిపై ప్రభావం చూపలేదన్నారు. తన భర్త చాలా అరుదుగా సిక్ లీవ్స్ తీసుకునేవాడని..క్రమం తప్పకుండా వారానికి 60గంటలకపైగా పనిచేసేవాడని తెలిపింది.

పిల్లలున్న తోటి ఉద్యోగులు తమ కుటుంబాలతో సమయం గడిపేందుకు వీలుగా థాంక్స్ గివింగ్, క్రిస్మస్ వంటి పండగల అప్పుడ కూడా తరుచూ ఆయన షిఫ్టులు చేసేవాడని వాపోయింది. అతను ఎప్పుడు పదోన్నతులుగానీ, శాలరీ పెంపు కానీ అడగలేదని..కేవలం కష్టమైన సమస్యలను పరిష్కరించడం మీదే ద్రుష్టిపెట్టి తన టీమ్ కు కట్టుబడి ఉండేవారని చెప్పుకొచ్చింది. నాకు జాలి అవసరం లేదు..ఈ లోకం తమ సర్వస్వాన్ని నిశ్శబ్దంగా నిలకడగా, ఏమీ తిరిగి ఆశించకుండా ఇచ్చే వాళ్లకు ఏం చేస్తుందో ఎవరో ఒకరికి తెలియాలంటూ ఆమె రాసింది.

Next Story