జస్ట్ వన్ సెల్ఫీ చాలు.. మనుషుల మనస్తత్వాన్ని చదివేస్తున్న ఏఐ..!

by Javid Pasha |

జస్ట్ వన్ సెల్ఫీ చాలు.. మనుషుల మనస్తత్వాన్ని చదివేస్తున్న ఏఐ..!

జస్ట్ వన్ సెల్ఫీ చాలు.. మనుషుల మనస్తత్వాన్ని చదివేస్తున్న ఏఐ..!
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎన్ని అద్భుతాలు చేస్తున్నదో తెలిసిన విషయమే. అనేక విషయాల్లో పనులను సులభతరం చేస్తోంది. మానవులకు సౌకర్యంగా మారుతోంది. తాజాగా మరో ఆసక్తికర విషయం కూడా మనముందుకొచ్చింది. ఇది సైన్స్ ఫిక్షన్‌లా అనిపించవచ్చు కానీ నిజం ఏంటంటే.. జస్ట్ ఒక్క సెల్ఫీతో మీ భావోద్వేగాలను చదవలిగే ఏఐ టెక్నాలజీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది.

యెస్.. ఒక్క క్లిక్ చాలు.. ఫోటోను వెంటనే స్కాన్ చేయడం ద్వారా మీలో ఒత్తిడి, దుఃఖం, కోపం, సంతోషం, లేదా భయం వంటి భావోద్వేగాలను చెప్పగలిగే ఏఐ వ్యవస్థ(AI system) ఇప్పుడు ఆవిష్కృతమై ఉంది. మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే మీ భావాలను అర్థం చేసుకొని విశ్లేషించే సాంకేతికత (Emotion Recognition Technology) ఇప్పటికే వివిధ రంగాల్లో ఉపయోగ పడుతోంది. అవేమిటి? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

ఎడ్యుకేషన్ సెక్టార్

పాఠశాలల్లో విద్యార్థుల మానసిక స్థితిని పర్యవేక్షించడానికి ఎమోషన్ రికగ్నిషన్ టెక్నాలజీ (Emotion Recognition Technology)ని పలు దేశాల్లో ఉపయోగిస్తు్న్నారు. ఉదాహరణకు ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్(ASD) ఉన్న పిల్లలకు సామాజిక సంకేతాల(Social signals)ను అర్థం చేసుకోవడంలో సహాయపడే అనువర్తనాలు(applications) డెవలప్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒత్తిడి లేదా ఆందోళన సంకేతాలను గుర్తించి, విద్యార్థులకు తగిన కౌన్సెలింగ్, మెరుగైన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో సహాయపడుతుంది.

ఆరోగ్య రంగంలో..

మానసిక ఆరోగ్య సంరక్షణలో కూడా ఏఐ ఎమోషన్ రికగ్నేషన్ సాంకేతికత విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఉదాహరణకు, డిప్రెషన్, ఆందోళన, లేదా నరాల సంబంధిత రుగ్మతల లక్షణాలను ముందస్తుగా గుర్తించడానికి గొంతు లేదా వాయిస్(throat style) విశ్లేషణ, ముఖ కవళికల విశ్లేషణ ఉపయోగపడుతున్నాయి. అలాగే టెలీహెల్త్ అపాయింట్‌మెంట్లలో రోగుల భావోద్వేగాలను విశ్లేషించి, వైద్యులకు రోగి, నొప్పి లేదా ఆందోళన స్థాయిని అంచనా వేయడంలో సహాయపడుతుంది. అలాగే ఎపిలెప్సీ, స్ట్రోక్, ముఖ కండరాల పక్షవాతం వంటి నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే రోగుల భావోద్వేగాలను గుర్తించడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.

రిటైల్ అండ్ మార్కెటింగ్

రిటైల్ స్టోర్లలో కస్టమర్ల ముఖ కవళికలను విశ్లేషించి, వారి భావోద్వేగాల ఆధారంగా వ్యక్తిగతీకరించిన ఉత్పత్తి(Personalized product) సిఫారసులు అందించడానికి ఫేస్ అండ్ బాడీ రికగ్నేషన్ ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఉదాహరణకు, క్లింగెల్ వంటి సంస్థలు లైవ్ షాపింగ్ సెషన్లలో కస్టమర్ల భావోద్వేగాలను విశ్లేషిస్తాయి. యాడ్‌వర్టైజింగ్‌లో, ఆఫెక్టివా వంటి సంస్థలు కస్టమర్ల భావోద్వేగ స్పందనల(Emotional responses)ను అధ్యయనం చేస్తాయి. ఇవి ఉత్పత్తి కొనుగోళ్లు లేదా యాడ్ షేరింగ్‌కు దారితీస్తాయి.

ఆటోమోటివ్ సెక్టార్

డ్రైవర్ల అలసట, ఒత్తిడి, లేదా దృష్టి లోపం, విజన్ ఇంపెయిర్మెంట్( Vision impairment)ను గుర్తించడానికి ఆఫెక్టివా, నౌటో వంటి సంస్థలు వాహనాల్లో ఈ సాంకేతికతను ఏకీకృతం(Integrating) చేస్తున్నాయి. ఇది రోడ్డు భద్రతను మెరుగుపరుస్తుంది.

సెక్యూరిటీ అండ్ సర్వైలెన్స్

విమానాశ్రయాల్లో ‘డౌట్ ఫుల్’ ప్రవర్తనను గుర్తించడానికి ముఖ కవళికలను విశ్లేషించే సాంకేతికతను కొన్ని ప్రభుత్వాలు పరీక్షిస్తున్నాయి. ఉదాహరణకు యూరోపియన్ యూనియన్‌కు సంబంధించిన iBorderCtrl ప్రాజెక్ట్ ఇంటర్వ్యూలలో మైక్రో - ఎక్స్‌ప్రెషన్స్ ఆధారంగా చీటింగ్, రాంగ్ బిహేవియర్ వంటి విషయాలను అంచనా వేస్తుంది. అర్బన్ సెక్యూరిటీలో సందేహాస్పద ప్రవర్తనను గుర్తించడానికి కూడా ఈ సాంకేతికత ఉపయోగించబడుతుంది.

ఎంటర్టైన్మెంట్

వీడియో గేమ్ డెవలపర్లు ఆటగాళ్ల భావోద్వేగాల(The emotions of the players) ఆధారంగా గేమ్ డైనమిక్స్‌ను సర్దుబాటు చేయడానికి ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకుల నిమగ్నతను విశ్లేషించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మూవీ ట్రైలర్లు, స్ట్రీమింగ్ కంటెంట్‌లో ప్రేక్షకుల భావోద్వేగ స్పందనలను అధ్యయనం చేయడానికి ఈ సాంకేతికత ఉపయోగించబడుతుంది.

కస్టమర్ సర్వీస్

కాల్ సెంటర్లలో కస్టమర్ల ఒత్తిడి లేదా సంతృప్తిని గుర్తించడానికి వారి స్వరం లేదా గొంతు శైలి(throat style) విశ్లేషణ ఉపయోగించబడుతుంది. ఇది కస్టమర్ సంతృప్తి స్కోర్‌లను మెరుగుపరుస్తుంది. కన్విన్ వంటి సంస్థలు కస్టమర్ ఇంటరాక్షన్‌లను రియల్-టైమ్‌లో విశ్లేషించి, ఏజెంట్లకు వ్యక్తిగతీకరించిన కోచింగ్ అందిస్తాయి.

ఏయే దేశాల్లో ఉపయోగిస్తున్నారు?

మనుషుల భావోద్వేగాలను గుర్తించే ఏఐ టెక్నాలజీని యునైటెడ్ స్టేట్స్‌లో ఆఫెక్టివా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, IBM వంటి సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి. ఆఫెక్టివా 87 దేశాల నుండి 10 మిలియన్ల మంది భావోద్వేగాల డేటాబేస్‌ను నిర్మించింది. ఇక చైనాలో పాఠశాల విద్యార్థుల అవగాహనను, మానసిక స్థితిని అంచనా వేయడానికి ఉపయోగిస్తున్నారు. యూరోపియన్ యూనియన్‌లో iBorderCtrl ప్రాజెక్ట్ ద్వారా విమానాశ్రయాల్లో భావోద్వేగ గుర్తింపు సాంకేతికతను పరీక్షిస్తున్నారు. అయితే యూరోపియన్ ఏఐ యాక్ట్ ఈ సాంకేతికతను వర్క్‌ప్లేస్‌లలో, విద్యా సంస్థల్లో నిషేధించింది. ఇక ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా వంటి దేశాలలో కూడా మార్కెటింగ్, హెల్త్‌కేర్, కస్టమర్ సర్వీస్ రంగాలలో ఈ సాంకేతికత అభివృద్ధి చేయబడుతోంది.

Next Story