రివాల్వర్‌తో ఎలన్ మస్క్ ట్వీట్.. ఎవరిని భయపెడుతున్నాడు?

by Dishanational4 |
రివాల్వర్‌తో ఎలన్ మస్క్ ట్వీట్.. ఎవరిని భయపెడుతున్నాడు?
X

దిశ, ఫీచర్స్: ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేసినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్‌‌లో అనేక మార్పులు చేసి.. 'ఫ్రీ స్పీచ్' గా వర్ణించే అంశాలకు ప్రాధాన్యతనిచ్చి విమర్శలు-ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే 120 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న ఎలన్ మస్క్.. తాజాగా అతడి బెడ్ రూమ్‌ నుంచి కొన్ని పిక్స్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసి మరోసారి చర్చనీయాంశంగా మారాడు.

కెఫిన్ లేని నాలుగు డైట్ కోక్‌ డబ్బాలు, రెండు రివాల్వర్‌లు, అమెరికన్ రివల్యూషనరీ వార్ పెయింటింగ్‌‌ను కలిపి తీసిన ఫొటోలకు 'మై బెడ్‌సైడ్ టేబుల్' అంటూ క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్‌కు ఫాలో అప్ ట్వీట్ చేస్తూ 'నా కోస్టర్స్ లేకపోవడానికి ఎటువంటి కారణం లేదు' అని పేర్కొన్నారు. దీంతో ఎలన్ షేర్ చేసిన ట్వీట్ కేవలం 20నిమిషాల్లోనే వైరల్‌గా మారి 55వేల కంటే ఎక్కువ లైకులను పొందింది.

ఇవి కూడా చదవండి

58గంటల కిస్‌తో వరల్డ్ రికార్డ్.. 70ఏళ్ల వృద్ధ జంట ఘనత



Next Story

Most Viewed