Viral News : తనతో పిల్లలను కనలేదని.. హీరోయిన్‌కు చుక్కలు చూపించిన ఎలన్ మస్క్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో..

by Sujitha Rachapalli |

ప్రపంచంలోనే అత్యంత అందమైనది ఎవరంటే అమెరికన్ నటి అంబర్ హెర్డ్ అని చెప్తారు నిపుణులు. ఆమె ముఖం కొలతలు అంత అద్భుతంగా ఉన్నాయని అంటారు. అయితే ఈ పాపులర్ హీరోయిన్ ప్రముఖ హీరో జాన్ డెప్‌తో పెళ్లి

Viral News : తనతో పిల్లలను కనలేదని.. హీరోయిన్‌కు చుక్కలు చూపించిన ఎలన్ మస్క్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే అత్యంత అందమైనది ఎవరంటే అమెరికన్ నటి అంబర్ హెర్డ్ అని చెప్తారు నిపుణులు. ఆమె ముఖం కొలతలు అంత అద్భుతంగా ఉన్నాయని అంటారు. అయితే ఈ పాపులర్ హీరోయిన్ ప్రముఖ హీరో జాన్ డెప్‌తో పెళ్లి, విడాకులతో మరింత పాపులర్ అయింది. భర్తపై గృహ హింస చట్టం కేసులో ఓడిపోయి పరువు తీసుకుంది. దీంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న నటి.. మళ్లీ స్క్రీన్‌పై కనిపించేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అంబర్ హెర్డ్‌.. జానీ డెప్‌తో విడిపోయేందుకు కారణం ఎలన్ మస్క్ అనే వాదన వినిపించింది. మస్క్‌తో ఇల్లీగల్ ఎఫైర్ కొంప ముంచిందని.. విడాకులకు దారితీసిందని టాక్.

కానీ అంబర్ హెర్డ్ ఎలన్ మస్క్‌కు ఎంత దగ్గరైందో అంతే దూరం పెట్టిందనే రూమర్స్ కూడా వినిపించాయి. ఒకప్పుడు ఆయనను బాగా యూజ్ చేసుకున్న ఆమె.. ఆ తర్వాత ఛీ కొట్టిందని, దీంతో మస్క్ ఆగ్రహంతో ఊగిపోయాడని సమాచారం. ట్విట్టర్‌‌లోనూ అతన్ని బ్లాక్ చేసిందని తెలిసింది. దీంతో ట్విట్టర్‌‌ను కొనుగోలు చేసిన మస్క్.. Xగా పేరు మార్చేసిన వెంటనే.. ఆమె ఎకౌంట్ లేకుండా చేశాడనేది పెద్ద గాసిప్. ఇక దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు ‘మోస్ట్ ఇన్‌సెక్యూర్ మ్యాన్’, ‘థాంక్ గాడ్ అంబర్, మస్క్‌తో పిల్లలను కనలేదు’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story