- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Late marriage: లేట్ వయసు పెళ్లితో సమస్యే లేదు.. ఇలా చేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు మీ సొంతం
Late marriage: ఈ రోజుల్లో చాలా మంది లేటు(Late marriage)గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: Late marriage: ఈ రోజుల్లో చాలా మంది లేటు(Late marriage)గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే చదువులు పూర్తయి..మంచి ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. లేటు వయస్సు (Late marriage)పెళ్లి కారణంగా చాలా మంది జంటలను సంతాన సమస్య వేధిస్తోంది. మగాళ్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, ఆడవాళ్లలో పీసీఓడీ(PCOD), పీసీఓఎస్(PCOS) సమస్యలతో పిల్లలకు జన్మనివ్వలేకపోతున్నారు. పాతికేళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నవారిని కూడా ఈ సమస్యలు తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాయి. మూడు పదుల వయసు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్నవారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది ఓ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఆలస్యంగా పెళ్లి(Late marriage) చేసుకున్నప్పటికీ ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిస్తున్నారు.
నేటి తరం యువత జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్ తో ముందుకు సాగుతోంది. అదే సమయంలో కెరియర్ నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే చదువులు ముగియగానే పెళ్లి, సంసార భారంలో మునిగిపోకుండా కొంత సమయం ఆగుతున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఇప్పుడే పిల్లలు వద్దు అంటూ కొందరు వాయిదా వేసుకుంటున్నారు. ఈ లోగా వయసు మూడు పదులు దాటుతోంది. మరికొందరు నలభై(Late marriage)కి దగ్గర్లోనే ఉంటున్నారు. అలాంటి వయసులో పిల్లలకు జన్మనివ్వడం అన్నది కాస్త ఇబ్బందికరం అంటున్నారు వైద్యులు. అంతేకాదు పుట్టే పిల్లలు కూడా అంత ఆరోగ్యంగా ఉండరని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్తపడే పద్దతినే ఎగ్ ఫ్రీజింగ్ (Egg freezing)అంటారు.
వయస్సు పెరిగే కొద్దీ మహిళల్లో అండాల నిల్వతోపాటు క్వాలిటీ కూడా తగ్గిపోతోంది. దీంతో పుట్టబోయే పిల్లల్లో శరీరక, మానసిక లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే వయసులో ఉన్నప్పుడే అధిక నాణ్యత గల అండాలను సేకరించి, వాటిని ఫ్రీజ్(Egg freezing) చేస్తారు. ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అండాల ద్వారా ఆరోగ్యకరమైన సంతానానికి జన్మ ఇవ్వొచ్చు. ఎగ్ ఫ్రీజింగ్(Egg freezing) కోసం ముందుగా మహిళ హెల్త్, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, హార్మోన్ల స్థాయి, రుతుచక్రం వంటి వాటిని డాక్టర్లు పరిశీలిస్తారు. సాధారణంగా ప్రతినెలా ఒక అండం విడుదల అవుతుంది. అయితే ఆ ఒక్కదాన్నే ఫ్రీజ్(Egg freezing) చేస్తే ఆ తర్వాత అందులో ఏదైనా సమస్య తలెత్తే ఇబ్బంది ఉంటుంది. అందుకే ఎక్కువ అండాలు విడుదలయ్యేలా ఇంజెక్షన్ కూడా ఇస్తారు. ఆ తర్వాత వాటిని ఫ్రీజ్(Egg freezing) చేస్తుంటారు.
చాలా మంది కెరియర్ కోసమే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది ముందుగా పెళ్లి చేసుకున్నప్పటికీ పిల్లలను ఆలస్యంగా కంటున్నారు. ఇలాంటి వారికి ఎగ్ ఫ్రీజింగ్(Egg freezing) ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. పిల్లలను కనడానికి వయసు అయిపోతోందని ఓ వైపు, కెరియర్ ఇంకా సెట్ కాలేదని మరోవైపు, కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఒత్తిడి మరోవైపు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ ఇలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా కెరియర్ పై ఫోకస్ పెట్టడానికి ఈ పద్దతి మంచిదంటున్నారు.






