- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి
విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ డా. కూరపాటి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్: దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ డా. కూరపాటి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న లోపాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొక్కివేయడం రాజకీయాలు కాదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించడమే ప్రభుత్వ ధర్మమని ప్రొఫెసర్ డా. కూరపాటి రమేష్ అన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ నాయకుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే విధంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డా. కొణతం కృష్ణ, ప్రో. బెనర్జీ రాష్ట్ర వైస్ చైర్మన్, దారం జనార్ధన్, ధనలక్ష్మి, దేవిక, ప్రో. అంజయ్య, కొలిపాక ప్రకాష్, నగేష్, దొమ్మటి ప్రవీణ్ కుమార్, రవితేజ, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.






