- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నో బ్యాగ్ డే వేళ అద్భుత ప్రయోగం
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్) విద్యార్థులు 'నో బ్యాగ్ డే'ను పర్యావరణ పరిరక్షణకు అంకితం చేస్తూ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు

దిశ, హన్వాడ : మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్) విద్యార్థులు 'నో బ్యాగ్ డే'ను పర్యావరణ పరిరక్షణకు అంకితం చేస్తూ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పుస్తకాల సంచి లేని రోజును కేవలం వినోదానికే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడేలా ఏకంగా 50 వేల సీడ్ బాల్స్ తయారు చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులు వేప, కుంకుడు, రావి, మర్రి, ఉసిరి, చింత, జామ తదితర చెట్ల విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేశారు. అనంతరం పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో సమీప అటవీ ప్రాంతంలో వాటిని చల్లే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణపై బాధ్యతాయుతమైన ఆలోచనతో ముందుకొచ్చిన విద్యార్థులను పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ రవూఫ్ తో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఉపాధ్యాయులు గౌరీశంకర్, పాండురంగ, నరేష్, భాను కిరణ్, కొండమ్మ, విజయలక్ష్మి, కేశవులు విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. వారి కృషిని స్థానికులు, విద్యాశాఖ అధికారులు, పర్యావరణ ప్రేమికులు ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేపట్టిన ఈ వినూత్న పర్యావరణ ఉద్యమం సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ, ప్రకృతి సంరక్షణపై అవగాహన పెంపొందించడంలో స్ఫూర్తిదాయకంగా మారింది.






