Red Meat : మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్.. అలా తింటే జరిగేది ఇదే..

by Javid Pasha |

Red Meat : మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్.. అలా తింటే జరిగేది ఇదే..

Red Meat : మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్.. అలా తింటే జరిగేది ఇదే..
X

దిశ, ఫీచర్స్ : మీరు నాన్‌వెజ్ ప్రియులా? ముక్కలేనిదో ముద్ద దిగదా? తింటే తినండి ఆరోగ్యానికి మంచిదే. కానీ.. రెడ్ మీట్ తినేవారే కాస్త ఆలోచించండి అంటున్నారు నిపుణులు ఎందుకంటే.. ఇది ఎక్కువగా తింటే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మాంసాహారం తినడంవల్ల కలిగే సానుకూల, ప్రతికూల ఫలితాలను తెలుసుకునేందుకు ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పరిశోధకులు 20 దేశాలలో 31 అధ్యయనాలు నిర్వహించి విశ్లేషించారు.

*నాన్‌వెజ్ ఎక్కువగా తినేవారిని స్టడీ చేసిన రీసెర్చర్స్, మొత్తం 19.7 లక్షల మందికి డయాబెటిస్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతి రోజూ 50 గ్రాముల ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినేవారిలో 15 డయాబెటిస్ రిస్క్ 15% పెరిగినట్లు గుర్తించారు. ప్రతిరోజు 100 గ్రాముల ప్రాసెస్ చేసిన పౌల్ట్రీ మాంసం తింటే 18% డయాబెటిస్ రిస్క్ పెరిగినట్లు వెల్లడించారు. ఇక డైలీ 100 గ్రాములు ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ తినేవారిలో మాత్రం డయాబెటిస్ రిస్క్ 25 % పెరిగినట్లు తేల్చారు. ఇక టైప్ 2 డయాబెటిస్ విషయానికి వస్తే ప్రాసెస్ చేసిన రెడ్‌మీట్ తినడంవల్ల 62 శాతం రిస్క్ పెరుగుతున్నట్లు గుర్తించారు.

*మాంసంలో ప్రొటీన్, ఐరన్, జింక్, బి. బి. కాంప్లెక్స్ విటమిన్లు, ఒమేగా 3 వంటి పోషకాలు ఫుల్లుగా ఉంటాయి. రెడ్ మీట్‌లో కూడా ఇనుము, జింక్ ఉంటుంది. విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. మొత్తానికి మాంసాహారం ఆరోగ్యానికి మంచిది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. అయితే అయితే సాధారణంగా వాటిని కూరగా వండి తినడంవల్ల మాత్రమే మేలు జరుగుతుంది. అంతేకానీ అధికంగా ప్రాసెస్ చేసిన మాంసాహారం, ప్యాకేజ్డ్ మాంసాహారం వంటివి మాత్రం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఊబకాయం, డయాబెటిస్ వంటి రిస్క్‌ను పెంచుతాయి. అందుకే ప్రాసెస్ చేసిన మాంసాహారం తినవద్దంటారు నిపుణులు. అధ్యయనాలు కూడా అదే చెబుతున్నాయి.

* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story