- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Beauty Tips : ఈ వయసులో అలా చేశారో.. నిత్య యవ్వనమే ఇక!!
Beauty Tips : ఈ వయసులో అలా చేశారో.. నిత్య యవ్వనమే ఇక!!

దిశ, ఫీచర్స్ : చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపంచాలని ఎవ్వరూ అనుకోరు. కానీ తమకు తెలియకుండానే కొన్ని శారీరక మార్పులకు గురవుతుంటారు పలువురు. 30 ఏండ్ల వయసులోనే 60 ఏండ్లు దాటిన వ్యక్తిలా మొఖంలో, శరీరంలో వృద్ధాప్య ఛాయలు ఏర్పడుతుంటాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన సంబంధాలు కూడా అందుకు కారణం అవుతుంటాయి. అట్లనే ఇటీవల చాలా వరకు పోషకాహార లోపం కూడా వృద్ధాప్య ఛాయలకు దారితీస్తుందని స్కిన్ స్పెషలిస్టులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
*ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా, ముఖ్యంగా చర్మ సంరక్షణను పెంపొందించే పోషకాలను తీసుకోవడం ద్వారా 60 ఏండ్ల వయసులోనూ 30 ఏండ్ల వ్యక్తిలా కనిపించే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం మీ శరీరంలో యవ్వన ఛాయను పెంచే కొల్లాజెన్ ఉత్పత్తి అవసరం. అది ఏయే ఆహారాల్లో, కూరగాయల్లో, పండ్లల్లో లభిస్తుందో తెలుసుకొని డైట్ మెయింటెన్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల తాజా పండ్లు అందుకు సహాయపడతాయి.
*దానిమ్మతో : నిగనిగలాడే చర్మ సౌందర్యాన్ని పెంచడంలో, వృద్ధాప్య ఛాయలను వెనక్కి నెట్టడంలో ఉపయోగపడే అద్భుత ఫలం దానిమ్మ. ఇందులో పాలీ ఫినోల్స్, విటమిన్ సి ఫుల్లుగా ఉంటాయి. పైగా ఇవి మీలో యవ్వన ఛాయకు కారణం అయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఫలితంగా స్కిన్‌పై రాషెస్, మొటిమలు, ముడతలు వంటివి తగ్గించడంలో సహాయపడతాయి. చర్మాన్ని తేమగా, స్మూత్‌గా ఉంచుతాయి. సో.. అందుకే అప్పుడప్పుడు దానిమ్మ పండును తప్పక తినాలంటున్నారు పోషకాహార నిపుణులు.
*పెర్సిమన్ ఫ్రూట్ : చర్మాన్ని అందంగా, యవ్వనంగా మార్చడంలో కీలకపాత్ర పోషించే మరో ఫలం పెర్సిమన్ ఫ్రూట్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం ఫుల్లుగా ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడతాయి. ముఖంపై ముడతలు తగ్గడంలో, షైనింగ్ రావడంలో సహాయపడతాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మీరు యవ్వనంగా కనిపించేలా చర్మంలో పలు మార్పులకు కారణం అవుతాయి.
*బొప్పాయి : అందరికీ అందుబాటులో ఉండే మరో పండు బొప్పాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా వృద్ధాప్య ఛాయలను అడ్డుకోవడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, బి, కె, ఇ ఉంటాయి. ఇవన్నీ చర్మ వ్యాధులను దూరం చేస్తాయి. చర్మం పొడిబారడాన్ని అడ్డుకుంటాయి. వృద్ధాప్య ఛాయలను దూరం చేసి, ఎక్కువకాలం చర్మం యవ్వనంగా మెరిసిపోయేందుకు సహాయపడతాయి. అందుకే బొప్పాయిని తప్పకుండా తినాలి.
*స్ట్రా బెర్రీ : చూడ్డానికి చిన్నగా, రుచిగా ఉంటాయి. అయితే యవ్వన ఛాయలను పెంపొందించడంలో మాత్రం స్ట్రా బెర్రీలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలవల్ల చర్మానికి కలిగే నష్టాన్ని నివారించడంలోనూ ఈ పండ్లలోని పోషకాలు సహాయపడతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. అందుకే మీరు ఎక్కువకాలం యవ్వనంగా కనిపించాలంటే స్ట్రా బెర్రీలను సైతం తింటూ ఉండండి.
*బ్లూ బ్రెరీ : స్ట్రా బెర్రీలాగే వృద్ధాప్య ఛాయలను దూరం చేసే మరో అద్భుత ఫలం బ్లూ బెర్రీ. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుంచి రక్షిస్తూ వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటాయి. దీనివల్ల చర్మంపై ముడతలు, గీతలు దూరం అవుతాయి. చర్మం నిగనిగలాడుతుంది. పైన పేర్కొన్న పండ్లు తరచుగా తింటూ ఉండేవారు తమ 60 ఏండ్ల వయసులోనూ 30 ఏడ్ల వ్యక్తిలా యవ్వన ఛాయలతో కనిపించే అవకాశం ఉంటుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదంటున్నారు నిపుణులు. సో.. మీరూ ట్రై చేసి చూడండి మరి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






