Early Death Risk : కదలకుండా కూర్చుంటున్నారా? మీ ఆయుష్షు తగ్గినట్టే !

by Javid Pasha |

Early Death Risk : కదలకుండా కూర్చుంటున్నారా? మీ ఆయుష్షు తగ్గినట్టే !

Early Death Risk : కదలకుండా కూర్చుంటున్నారా? మీ ఆయుష్షు తగ్గినట్టే !
X

దిశ, ఫీచర్స్ : ఎప్పుడూ ఒకే దగ్గర కూర్చుంటే ఏమోస్తది రోగం తప్ప అంటుంటారు పెద్దలు. అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే కదలిక లేనిజీవన శైలి పలు అనారోగ్యాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. దీర్ఘకాలంపాటు అదే కొనసాగితే డయాబెటిస్, స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి దాడిచేసే అవకాశం ఎక్కువని అంటున్నారు. కాగా తాజా అధ్యయనం కూడా మరోసారి అదే చెప్పింది. అదనంగా నిశ్చల జీవన శైలి అకాల మరణాలకు దారితీసే చాన్స్ అధిగమని పరిశోధకులు పేర్కొంటున్నారు.

తరచుగా ఒకే చోట కూర్చొని ఉండటం, ఏమాత్రం వ్యాయామాలు చేయకపోవడం, కనీసం వాకింగ్ చేసేందుకు కూడా బద్దకించడం చాలా ప్రమాదకరమని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు. కదలిక లేని జీవన శైలి మనిషి జీవన ప్రమాణాలపై ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి అధ్యయనం నిర్వహించారు. కాగా ప్రతి రోజూ తమ తమ పనుల్లో యాక్టివ్‌గా ఉండే వ్యక్తులతో, శారీరక శ్రమలో పాల్గొనే వారితో పోలిస్తే, రోజు మొత్తంలో ఎక్కువ సమయం కదలికలేని జీవన శైలిని కలిగి ఉంటూ ఏమాత్రం ఫిజికల్ యాక్టివిటీస్‌కు మొగ్గు చూపని వ్యక్తుల్లో డెత్ రిస్క్ 16% పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా కనుగొన్నారు.

నిశ్చల జీవనశైలిని కలిగి ఉంటూ ఏమాత్రం వ్యాయామాలు చేయని వారిలో మరణాలకు గల కారణాలను పరిశోధకులు విశ్లేషించినప్పుడు వాటిలో 34 శాతం మరణాలు గుండె జబ్బులవల్ల సంభవిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో కదలికలేని వ్యక్తుల ఆయుష్షు తగ్గుతుందని చెబుతున్నారు. కాగా ఇటువంటి రిస్క్ నుంచి తప్పించుకోవాలంటే ప్రతిరోజూ ఎక్కువ సమయం ఒకే దగ్గర కూర్చునే వ్యక్తులు కనీసం 15 నుంచి 30 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు తైవాన్‌లో 1996 నుంచి 2017 వరకు సుమారు 4,82,000 మంది వ్యక్తుల ద్వైవార్షిక (Taiwan from) హెల్త్ చెకప్స్ డేటాను ఎనలైజ్ చేశారు. వారు పనిలో ఎంత సేపు కూర్చుంటున్నారు? అలాగే స్మోకింగ్, డ్రింకింగ్, ఎక్సర్‌సైజ్ లెవెల్స్ లైఫ్ స్టై్ల్ ఎలా ఉన్నాయో అంచనా వేశారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా దానిని వర్తింపజేస్తూ అంచనా వేశారు. కాగా వర్క్ పర్పస్ కోసం ఎక్కువ సేపు కూర్చొని ఉండే జీవన శైలి కలిగి, ఫిజికల్ యాక్టివిటీస్‌లో పాల్గొనని వారిలో 60 % మందిని, ప్రత్యామ్నాయంగా, అంటే.. మధ్య మధ్యలో బ్రేక్ ఇవ్వడం వంటి పద్ధతుల్లో కూర్చొని ఉండే జీవన శైలి, అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండేవారి వారిలో 29% మందిని, అలాగే ఎక్కువగా కూర్చునే అవసరంలేని వారిలో 10% మందిని రీసెర్చర్స్ మూడు గ్రూపులుగా విభజించి అబ్జర్వ్ చేశారు. ఈ సందర్భంగా వారు గ్యాప్ లేకుండా రోజులో ఎక్కువ సమయం ఒకేచోట కూర్చొని పనిచేసే నిశ్చల జీవన శైలి కలిగి ఉంటూ వ్యాయామాలు చేయని వారిలో డెత్ రిస్క్ 16 శాతం, గుండె జబ్బుల రిస్క్ 34 శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు. అంటే కదలికలేని జీవనశైలి, శారీరక శ్రమలేకపోవడం మానవ ఆయుష్షును త్వరగా క్షీణింపజేస్తుందని కూడా పరిశోధకులు పేర్కొన్నారు.

Next Story