- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పనికి 60 నిమిషాల ముందు నీటిలో ఇది కలిపి తాగండి .. ఉత్సాహం ఉరకలేస్తుందిక!
ఆ పనికి 60 నిమిషాల ముందు నీటిలో ఇది కలిపి తాగండి.. ఉత్సాహం ఉరకలేస్తుందిక!

దిశ, ఫీచర్స్ : తేనె రుచిలో తీయగా ఉండటమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ అద్భుతంగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి అధ్యయనం మరిన్ని ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించింది. వ్యాయామానికి 60 నుంచి 90 నిమిషాల ముందు తేనె కలిపిన నీటి (honey water)ని తాగడంవల్ల ఉత్సాహం పెరగడంతోపాటు శరీరం, ముఖ్యంగా కాళ్ల కండరాల నొప్పి 30% వరకు తగ్గుతుందని, మొత్తం శరీర పనితీరును మెరుగు పరుస్తుందని పేర్కొన్నది. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.
* తేనెలో నేచురుల్ షుగరింగ్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వ్యాయామానికి ముందు 1 టేబుల్ స్పూన్ తేనెను, 250 నుంచి 300 మి.లీ గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల శరీరానికి తగిన ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. బాడీలో నొప్పి, వాపు వంటివి ఉంటే తగ్గిస్తుంది. అంతేకాకుండా హనీ వాటర్ తాగడంవల్ల శరీరంలో గ్లైకోజన్ (Glycogen) లభ్యత మెరుగు పడి, కండరాలను బలోపేతం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అదనంగా తేనెలోని మైక్రోన్యూట్రియెంట్స్ కండరాల పునరుద్ధరణను వేగవంతం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*ఫ్రక్టోస్, గ్లూకోస్ వంటి సహజ చక్కెరలు కలిగి ఉండటంవల్ల తేనె తక్షణ శక్తిని అందిస్తుంది. నీటిలో కలిపి తాగడంవల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు కండరాలలో ఆక్సీకరణ ఒత్తిడి(Oxidative stress)ని, వ్యాయామం తర్వాత వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాకుండా తేనె నీరు శరీరంలో హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అయితే అధికంగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. డయాబెటిస్ ఉన్నవారు అయితే డాక్టర్ల సలహా మేరకు తీసుకోవాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link






