Coffee benefits : మితంగా తీసుకుంటే మేలు.. అతిగా తీసుకుంటే అంతే ఇక.. ఈ డ్రింక్ చేసే అద్భుతం ఏంటంటే..!

by Javid Pasha |   (  Updated:2025-06-05 14:18:59  IST  )

Coffee benefits : మితంగా తీసుకుంటే మేలు.. అతిగా తీసుకుంటే అంతే ఇక.. ఈ డ్రింక్ చేసే అద్భుతం ఏంటంటే..!

Coffee benefits : మితంగా తీసుకుంటే మేలు.. అతిగా తీసుకుంటే అంతే ఇక.. ఈ డ్రింక్ చేసే అద్భుతం ఏంటంటే..!
X

దిశ, ఫీచర్స్ : రోజులో ఒక్క కప్పు అయినా సిప్ చేయకుంటే అసలు పొద్దు గడవదు చాలా మందికి. ఇంతకీ ఏంటది అంటారా? అదే కాఫీ, ప్రస్తుతం చాలామంది ఫేవరెట్ డ్రింక్స్‌‌లో ఇది కూడా ఒకటి. కొందరికి పొద్దున్న లేవగానే తాగకుంటే ఏమీ తోచదు. ఇక నలుగురు ఫ్రెండ్స్ కలిసినా, ఇంటికి అతిథులొచ్చినా కొందరు వెంటనే అడిగే మాట కాఫీ తాగుతారా? అని. ఇలాంటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ కాఫీలో కెఫిన్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా తాగితే తలొనప్పి, మైగ్రేన్, నిద్రలేమి సహా పలు రకాలహెల్త్ ఇష్యూస్ తలెత్తుతాయని చెబుతుంటారు. కానీ ఓ తాజా అధ్యయనంలో మాత్రం కాఫీ ఆరోగ్యానికి మంచిదని తేలింది. పైగా మితంగా తాగేవారిలో టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్ తగ్గుతుందని పేర్కొన్నది. ఆ వివరాలేంటో చూద్దాం.

‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం’లో పబ్లిషైన అధ్యయనం ప్రకారం.. కాఫీని లిమిటెడ్‌గా తాగే వారిలో గుండె జబ్బులు, మధుమేహం, కార్డియో మెటబాలిక్ వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. నిజానికి కార్డియోమెటబాలిక్ వ్యాధులు గుండె, జీవక్రియ సమస్యలతో ముడిపడి ఉంటాయి. వీటి కారణంగా గుండెపోటు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటప్పుడు కాఫీని రోజు మొత్తంలో మూడు కప్పులకు మించి గానీ, అంతకంటే ఎక్కువసార్లు గానీ తీసుకుంటే ఈ సమస్యలు మరింత అధికం అవుతాయి. అదే రోజూ ఒకటి లేదా మూడు కప్పుల వరకు మాత్రమే కాఫీ తాగే వారిలో మాత్రం రిస్క్ తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

పాలలో కాఫీ పొడి కలిపి తీసుకునే కాఫీకంటే మిల్క్ లేకుండా వేడినీళ్లల్లో కాఫీ పొడి కలుపుకొని తాగే బ్లాక్ కాఫీ ఇంకా మంచిదని నిపుణులు అంటున్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పరిశోధకుల గత అధ్యయనం కూడా రోజుకు మూడు కప్పుల వరకు కాఫీ వినియోగం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 23-50% తగ్గిస్తుందని పేర్కొన్నది. మరో అధ్యయనంలో డాక్టర్ జుస్సీ కౌహనెన్ నేతృత్వంలోని పరిశోధకుల బృదం కాఫీ తాగే వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20-30% తగ్గించినట్లు కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకులు కాఫీ గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గిస్తున్నట్లు గుర్తించారు.

Next Story