రాత్రి సమయంలో అలా సెక్స్ చేస్తే ప్రాణాలు పోవడం ఖాయం

by Bhoopathi Nagaiah |   (  Updated:2024-02-03 13:23:34  IST  )

టీనేజ్‌లోనే సెక్స్ కోరికలు పురి విప్పుతాయి. యుక్త వయసు వచ్చే సరికి వాటిని అదుపు చేసుకోవడం కాస్తా కష్టమే.

రాత్రి సమయంలో అలా సెక్స్ చేస్తే ప్రాణాలు పోవడం ఖాయం
X

దిశ, వెబ్‌డెస్క్ : టీనేజ్‌లోనే సెక్స్ కోరికలు పురి విప్పుతాయి. యుక్త వయసు వచ్చే సరికి వాటిని అదుపు చేసుకోవడం కాస్తా కష్టమే. అయితే శృంగారంపై యువతీయువకులు ఎన్నో కలలు కంటారు. తన భాగస్వామితో ఇలా చేయాలి.. అలా చేయాలని స్వప్న లోకంలో విహరిస్తుంటారు. పెళ్లి కాగానే తమ కోరికలను తీర్చుకుంటారు. అయితే శృంగారంపై తాజాగా చేసిన అధ్యయనంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. శృంగారం చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక సమయాలు కేటాయించుకోవాలట. ఎలా పడితే అలా.. ఎప్పుడు పడితే అప్పుడు సెక్స్ చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సహజంగా దంపతులు రాత్రి సమయంలోనే సెక్స్ చేయడానికి సుముఖతగా ఉంటారు. ఉదయం ఇంట్లో పనులు, పిల్లలు, ఉద్యోగం అంటూ తీరిక లేకుండా ఉండారు. అందుకే 90 శాతం జంటలు రాత్రి సమయంలోనే శృంగారానికి టైమిస్తారు. అయితే ఆరోగ్యకర కలయిక ఏ సమయంలో చేసుకున్నా పర్వాలేదు. కానీ ఫుల్‌గా మద్యం సేవించి లేదా కడుపు నిండా భోజనం చేసి సెక్స్ చేస్తే ప్రాణాలు పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. అలా సెక్స్ చేస్తే గుండెపోటుతోపాటు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

రాత్రి సమయం కంటే తెల్లవారు జామున లేదా ఉదయం సెక్స్ చేసుకుంటే ఆలుమగలు ప్రత్యేకంగా మళ్లీ వ్యాయమం చేయాల్సిన అవసరం కూడా ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఉదయం సమయంలో సెక్స్ చేసుకోవడం వల్ల గుండెపోటు సమస్యలను చాలా వరకు తగ్గించవచ్చని పేర్కొంటున్నారు. అలాగే బాడీ రిలాక్స్ కావడంతోపాటు రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుందని, యాక్టీవ్‌గా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. నిత్యం సెక్స్ చేసుకునే జంటలు ఆరోగ్యవంతంగా ఉంటాయని, మానసికంగా బలంగా ఉంటారని చెబుతున్నారు. కనీసం వారానికి మూడుసార్లయినా సెక్స్ చేసుకుంటే రోగాలబారిన పడకుండా ఉంటారని ఎన్నో అధ్యయనాలు ఇప్పటికే రుజువు చేశాయి.

Next Story