- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Party Combo : సుక్క.. ముక్క లేనిదే రోజు గడవదా ‘పుష్పా’..! ఎంత డేంజరో తెలుసా!!
Party Combo : సుక్క.. ముక్క లేనిదే రోజు గడవదా ‘పుష్పా’..! ఎంత డేంజరో తెలుసా!!

దిశ, ఫీచర్స్ : సుక్క.. ముక్క లేనిదే కొందరికి ముద్ద దిగదు. తాగుడు తినుడులో తప్పులేకపోవచ్చు కానీ.. ఎంత తాగుతున్నం, ఏం తింటున్నం అనేది కూడా ఇక్కడ ముఖ్యమే. ఎందుకంటే ఏదైనా ఒక పరిమితికి లోబడి ఉన్నప్పుడు ఆనందానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుందని, లిమిట్ దాటితే మాత్రం అమృతమైనా సరే విషంగా మారుతుందని పెద్దలు అంటుంటారు. తాజా అధ్యయనం కూడా అదే చెబుతోంది. మద్యం తాగుతూ.. స్పైసీగా వేయించిన మటన్ ముక్కనో, చికెన్ ముక్కనో సిప్ చేస్తుంటే నా సామిరంగా ఆ మజాయే వేరని పోరగాల్లు మస్తు ఊరిస్తుంటరు. కానీ ప్రతి రోజూ అదే పనైతే మాత్రం డేంజరే అంటోంది BMJ ఆంకాలజీలో పబ్లిషైన తాజా అధ్యయనం. ఆ వివరాలేంటో చూద్దాం.
*పార్టీ అనగానే ఎక్కువ మందికి వెంటనే గుర్తొచ్చేది మద్యం, మాసం కాంబోనే. కానీ ప్రతిరోజూ ఇలా చేస్తే మాత్రం మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందిదని వాష్టింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ హార్వర్డ్, చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. 50 ఏళ్లలోపు వయస్సు గలవారిలో అయితే ప్రారంభ-ఆన్సెట్(Early-onset) కొలొరెక్టల్ క్యాన్సర్ (EO-CRC) ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది.
*అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 1,40,000 మంది వ్యక్తుల జీవనశైలి డేటాను దశాబ్దాల పాటు విశ్లేషించారు. బాకన్, హాట్ డాగ్స్, డెలీ స్లైస్ల వంటి ప్రాసెస్డ్ మాంసాలను మద్యంతో కలిపి తీసుకునే వారిలోనూ, అట్లనే మద్యం ప్రతిరోజూ వినియోగించేవారిలోనూ ఈ కాంబినేషన్ కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని సినర్జిస్టిక్గా పెంచుతుందని ఈ సందర్భంగా గుర్తించారు. ఇక వ్యాయామాలు లేకపోవడం, ధూమపానం చేయడం వంటివి దీనికి తోడైతే మరింత ప్రమాదకరమని కూడా పరిశోధకులు తేల్చారు.
*మద్యంలో మెదడును ప్రభావితం చేసే సమ్మేళనాలు ఉండటం, అలాగే ప్రాసెస్డ్ మాంసాలలో సోడియం నైట్రేట్ వంటి సంరక్షకాలు అధికంగా ఉండటం పెద్దప్రేగు క్యాన్సర్(Colorectal cancer)కు దారితీస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా సోడియం నైట్రేట్ వంటి సంరక్షకాలు జీర్ణక్రియ సమయంలో N-నైట్రోసో సమ్మేళనాలుగా, క్యాన్సర్కు కారణమయ్యే కార్సినోజెన్లుగా మారుతాయి. దీంతో మందు, ప్రాసెస్డ్ మాంసం కాంబో ప్రతిరోజూ కొనసాగిస్తే కొలొరెక్టల్ క్యాన్సర్ రిస్క్7- 8% పెరుగుతుందని అధ్యయనం స్పష్టం చేసింది.
Read More: 40 బజ్జీలు తింటే కారణజన్ముడు అవుతాడా? సోషల్ మీడియాలో ఒకటే గోల గోల






