- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాధవ్ చవాన్.. పేదవారి విద్యా ఉద్యానం.!
ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా వేలాదిమందికి విద్యాబుద్ధులతు నేర్పాడు చవాన్ సాబ్

దిశ, ఫీచర్స్: చదువుంటేనే సాధికారత సాధ్యం. చదువుకుంటేనే మానవ మనుగడ సాధ్యం. కానీ ఇప్పటికీ చాలాచోట్ల స్థోమత లేక ఎంతోమంది చదువుకు దూరమవుతున్నారు. అలాంటి పేదింటి బిడ్డలను విద్యా కుసుమాలుగా మారుస్తున్నాడు డాక్టర్ మాధవ్ చవాన్. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా వేలాదిమందికి విద్యాబుద్ధులతు నేర్పాడు చవాన్ సాబ్.
కెమిస్ట్ నుంచి యాక్టివిస్ట్..
డాక్టర్ మాధవ్ చవాన్ మొదట కెమిస్ట్. ఒహియో స్టేట్ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ చేశాడు. యూఎస్‌లో తనకెంతో ప్రాధాన్యత ఉన్న అకడమిక్ కెరీర్‌ను వదిలేసి ఇండియా వచ్చాడు. ఇక్కడికొచ్చిన తర్వాత కెమిస్ట్ నుంచి ఎడ్యుకేషన్ యాక్టివిస్ట్‌గా మారాడు. 1995లో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌ను స్థాపించి దాని ద్వారా మిలియన్ల మంది పేద పిల్లల విద్యను అందించాడు. విస్తృత అక్షరాస్యత కార్యక్రమాలతో విద్యా రంగాన్ని పునర్నిర్వచించి అట్టడుగు స్థాయిలో ఉన్నవారికి విద్యనందించాడు. ఎన్నో ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు. అందుకే అతడిని పేదవారి విద్యా ఉద్యానంగా పిలుస్తారు.
నిరక్షరాస్య నిర్మూలన..
అణగారిన వర్గాలకు చెందిన వేలాదిమంది పిల్లలకు చదువు కలను సాకారం చేయడంతో వారికి ఆరాధ్యుడయ్యాడు మాధవ్ చవాన్. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు వరించాయి. 2012లో వైస్ ప్రైజ్.. 2011లో స్కోల్ అవార్డ్.. 2014లో బీబీవీఏ ఫౌండేషన్ నాలెడ్జ్ అవార్డు.. 2014లో ఏషియా గేమ్ ఛేంజర్ అవార్డు.. 2018లో నిరక్షరాస్యత నిర్మూలనకు గానూ లూయిస్ చే వూ అవార్డు.. 2010లో లీడర్ షిప్‌ను గుర్తిస్తూ క్రావిస్ అవార్డు.. నాణ్యత గుర్తింపులో క్వింప్రో అవార్డు.. ఐమా ఎక్సలెన్స్ అవార్డులు వచ్చాయి.
20కి పైగా దేశాల్లో..
డాక్టర్ మాధవ్ చవాన్ కృషి నూతన విద్యా విధానంలో సంస్థాగత ప్రభావాన్ని నిరూపిస్తోంది. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మూలాలు ముంబై మురికివాడల్లో ఉన్నాయి. ఈ ఫౌండేషన్ చవాన్ మార్గదర్శకత్వంలో జాతీయ స్థాయికి విస్తరించింది. 'సరైన స్థాయిలో బోధన' చేస్తున్నారా లేదా అనేది చవాన్ సాబ్ నిరంతరం పర్యవేక్షించేవాడు. అంత శ్రద్ధ ఉంది కాబట్టే ఈ ఫౌండేషన్ సేవలు 20 కంటే ఎక్కువ దేశాలలో అమలవుతున్నాయి. వేగవంతమైన అభ్యాసాన్ని అందించడానికి వయస్సు లేదా గ్రేడ్‌లు ఆధారంగా కాకుండా ఒరిజినల్ అభ్యాస స్థాయిల ఆధారంగానే పిల్లలను సమూహపరుస్తుందని చెప్తున్నాడు చవాన్.






