- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Valentine's Day : లవ్ ఉన్నా లవర్ లేదని ఫీలైపోతున్నారా..?! ఇదిగో చిట్కా!
జంటలేని ఒంటరి జీవితం ఎందుకు? అనుకోకండి బ్రో.. మీకు వాలెంటైన్స్ డే రోజు ఏం చేయాలనే సందేహమే అవసరం లేదు. ఆరోజు మీ ఆలోచనలు ఆందోళనకరమైన విషయాలవవైపు వెళ్లకుండా ఉండేందుకు వివిధ పనులు, కార్యకలాపాలు మస్తు ఉంటాయి.

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు లవ్ చేసుకోవడమంటే పెద్ద టాస్కే.. పైగా అది అందరికీ చెప్పకూడని రహస్యంగా భావించే వారు. ఇప్పుడట్లేం లేదు బ్రో.. అంతా ఓపెన్ టాప్ సీక్రెట్లే..! పైగా ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ లేదని నామోషీగా ఫీలయ్యే బాయ్స్.. బాయ్ ఫ్రెండ్ లేడని నామోషీగా ఫీలయ్యే గర్ల్స్ ఎక్కువే ఉంటున్నారనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు! పైగా అసలే వాలెంటైన్స్ డే సందర్భమిది. మరి గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ల పరిస్థితి ఏంటి? అని కూడా కొందరు సరదాగా మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో.. అలాంటి వారికోసం కూడా ఏదో ఒక మార్గం లేకపోలేదు బ్రో/సిస్ అని సలహాలిస్తున్నారు పలువురు.. అవేంటో చూద్దాం పదండి!
లవర్ ఉన్నోళ్లకేంటి బ్రో.. నచ్చిన విధంగా వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు. ఆరోజు సినిమాలకో, షికార్లకో, విహార యాత్రలకో ప్లాన్ చేసుకుంటారు. కొందరు ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేస్తారు. ఇదంతా పక్కన పెడితే.. మరి మా సంగతేంటి? అనే సందేహాలు ‘ఏక్ నిరంజన్’లను, ‘పెళ్లి కాని ప్రసాదు’లను వెంటాడుతుంటాయి. అయితే మీకు లేనంత మాత్రాన మీరలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు నిపుణులు. గర్ల్ ఫ్రెండ్ లేని యువకులు లేదా బాయ్ ఫ్రెండ్ లేని యువతులు, ఒంటరి వాళ్లమని, జంట లేదని, తమకేం సరదాలుంటాయని నిరాశ చెండాల్సిన పని లేదని చెబుతున్నారు. గర్ల్/బాయ్ ఫ్రెండ్ లేకపోయినా అందమైన క్షణాలను ఆస్వాదించే సరదా కార్యకలాపాలు చాలానే ఉంటాయి ట్రై చేయండని చెబుతున్నారు.
ఇలా ప్లాన్ చేసుకోవచ్చు..
పార్ట్‌నర్ లేదా బాయ్/గర్ల్ ఫ్రెండ్ లేకున్నా ఆనందంగా గడపడానికి అనేక మార్గాలు ఉంటాయి. ‘‘ముఖ్యంగా ఒంటరి వ్యక్తులు ఆ రోజు తమను తాము ప్రేమించుకోండి. ఇష్టమైన పనులు మీకోసం చేసుకోండి. దీనివల్ల మీలో గొప్ప అనుభూతి కలుగుతుంది. మీ భవిష్యత్తుకోసం మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ ఆరోగ్యంపట్ల మీరు తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మీ పై మీరు నమ్మకాన్ని కలిగి ఉండటం ప్రేమకు మరో రూపంగా నిలుస్తుంది’’ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా ఉండే వ్యక్తులు ఆత్మ విశ్వాసంతో ఉండి అనేక విజయాలు సాధించగలుగుతారు. తద్వారా సమాజంలో గుర్తింపు, ఆదరణ, ప్రేమ సహజంగానే లభిస్తుంటాయి. పైగా ‘మిమ్మల్ని మీరు నిజంగా ప్రేమించుకున్నప్పుడే ఇతరులను ప్రేమించగలుగుతారు’ అంటుంటారు. కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నట్లయితే అస్సలు ఫీలవ్వకండి. వాలెంటైన్స్ డే రోజు సరదాగా, మరింత ఉత్సాహంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి.
ఫ్రెండ్స్‌తో కలిసి..
లైఫ్‌లో ఒంటరితనం లేదా పార్టనర్ లేకుండా ఉండటం కూడా అత్యంత సహజమైన దశ, యుక్త వయస్సుకు రాగానే వెంటనే గర్ల్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో కలిగి ఉండాలనే రూల్ ఏమీ లేదు కదా! ప్రతి ఒక్కరూ ప్రేమలో పడి చెట్ట పట్టాలేసుకుని తిరుగాలని కూడా లేదు. ఎవరి చాయిస్‌ను బట్టి వారు ఉంటారు. ఎవరి ఆసక్తిని బట్టి వారు మెలుగుతుంటారు. ఆయా పరిస్థితులు, అవకాశాలు కూడా సరదాలు, సంతోషాలు, పార్టనర్లు వంటి విషయాల్లో ప్రభావం చూపుతుంటాయి. సో.. మీరు మీ విషయంలో అస్సలు దిగులు పడకూడదంటున్నారు నిపుణులు. మీరు ఏక్ నిరంజన్‌లు అయినా సరే.. వాలెంటైన్స్ డే రోజు, మీ లాంటివారు ఇంకెంతోమంది ఉంటారని మర్చిపోకండి. మీ స్నేహితుల్లోనే చాలా మంది సింగిల్స్ ఉంటారు. వారితో కలిసి ఆ రోజు సరదాగా గడిపే ప్లాన్ చేసుకోండి. అందరూ కలిసి పార్టీ చేసుకోవచ్చు. నచ్చితే ఏ సముద్ర తీరానికో వెళ్లి క్యాండిల్లైట్ పార్టీ కూడా చేసుకోవచ్చు. అందరూ కలిసి సినిమాలకు, విహారాలకు వెళ్లొచ్చు. అందర్నీ ఉత్తేజ పరిచే సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఒంటరి వారందరూ కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. చేయాలే కానీ బోలెడన్ని పనులుంటాయ్.. పంచుకోవాలి కానీ అనేక వేదికలు మీకోసం సిద్ధంగా ఉంటాయ్.
నచ్చిన ప్రదేశానికి వెళ్లి..
ఫ్రెండ్స్‌తో కలిసి నచ్చిన ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిసరాలను ఆస్వాదించవచ్చు. ఫిబ్రవరి 14 నాడు నచ్చిన హోటల్‌కు వెళ్లి రుచికరమైన ఆహారంతో లంచ్ లేదా డిన్నర్ చేయవచ్చు. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకోవచ్చు. వాలెంటైన్స్ డే గురించి చర్చించవచ్చు. అందరూ కలిసి ఫోటోలు దిగడం, వివిధ ఆటలు ఆడటం చేయవచ్చు. ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం ఇష్టం లేకుంటే ఒంటరిగా ఉండి కూడా మీరు ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. మీ అందం, ఆహార్యంపై దృష్టి పెట్టండి. లేదా మీకు ఇస్టమైన దుస్తులు కొనడానికి, ఫేషియల్ చేసుకోవడానికి సమయం కేటాయించుకోండి. నచ్చిన హెయిర్‌కట్‌ని చేయించుకోండి. దీనివల్ల మీ మనసులో అందమైన అనుభూతి కలుగుతుంది.
అక్కడే ఆగిపోకండి.. !
ఆ రోజు మీరు సినిమా చూడాలంటే పార్టనర్ లేరని ఆగిపోకండి. అలా లేని ఇతర స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లండి. లేకుంటే ఇంట్లోనే మీకు నచ్చిన సినిమాలు, సిరీస్‌లు చూడండి. మీరే ఏవైనా రీల్స్ చేయండి. దీంతో మీలో ఆరోజు ఆనందం రెట్టింపవుతుంది. మీలోని అందమైన, ఉత్సాహ భరితమైన భావోద్వేగాలవల్ల ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్‌లు కూడా మీ మెదడులో రిలీజ్ అవుతాయి. మిమ్మల్ని మరింత ఉత్సాహంగా ఉంచుతాయి. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలు చూడటానికి ఇష్టం లేకపోతే, మరో మార్గం ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో, తోబుట్టువుతో కలిసి డిన్నర్ చేయడం, సినిమాలు చూడటం చేయవచ్చు. మీకు డ్యాన్స్ ఇష్టమైతే అది కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. కొత్త కొత్త బీట్స్ గురించి తెలుసుకోవచ్చు.
ఈ యాక్టివిటీస్‌లో పాల్గొనవచ్చు
వాలెంటైన్స్ డే రోజు ఇబ్బందిగా ఫీలవ్వకుండా ఉండేందుకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కూడా ఎంచుకోవచ్చు. ఆ రోజు అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో వెళ్లి అక్కడ గడపవచ్చు. వివిధ పనుల్లో సాయం చేయవచ్చు. ఆయా వ్యక్తులతో సంభాషించడం మీకు ఇష్టమైతే అలా కూడా చేయవచ్చు. వారి గురించి తెలుసుకున్నాక మీలో ఏవైనా ఐడియాలు వస్తే పంచుకోవచ్చు.
ఆహ్లాదకరంగా, ఆనందంగా..
జంటలేని ఒంటరి జీవితం ఎందుకు? అనుకోకండి బ్రో.. మీకు వాలెంటైన్స్ డే రోజు ఏం చేయాలనే సందేహమే అవసరం లేదు. ఆరోజు మీ ఆలోచనలు ఆందోళనకరమైన విషయాలవవైపు వెళ్లకుండా ఉండేందుకు వివిధ పనులు, కార్యకలాపాలు మస్తు ఉంటాయి. మీరుండే రూమ్, హాస్టల్ గది లేదా మీ ఇంటిని సర్దుకోవచ్చు. అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేలా తీర్చిదిద్దుకోవచ్చు. మీరే స్వయంగా మార్కెట్‌కు వెళ్లి అలంకరణ వస్తువులను తీసుకొచ్చి అలంకరించుకోవచ్చు. మీరు కూడా అందంగా ముస్తాబై అద్దంలో చూసుకుని మురిసిపోవచ్చు. కుటుంబ సభ్యలు మెచ్చే పనులు చేయవచ్చు. ఇష్టమైన వంటకాలు వండుకొని తినవచ్చు. లేదా ఆర్డర్ చేసుకోవచ్చు. నచ్చిన పుస్తకాలు చదవొచ్చు. పెండింగ్‌లో ఉన్న మీకు ఇష్టమైన పనులు పూర్తి చేయవచ్చు. పెరట్లో కొత్తగా మొక్కలను నాటవచ్చు. మనసులో ఎవరైనా ఉంటే ప్రపోజ్ చేయవచ్చు. చేయాలేగానీ అనేక రకాల పనులు, కార్యకలాపాలు ఉంటాయి. అవి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి. కాబట్టి డోంట్ వర్రీ బాయ్స్ అండ్ గర్ల్స్!






