- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీనేజర్ల విషయంలో నిర్లక్ష్యం వద్దు..!
![టీనేజర్ల విషయంలో నిర్లక్ష్యం వద్దు..! టీనేజర్ల విషయంలో నిర్లక్ష్యం వద్దు..!](https://www.dishadaily.com/h-upload/2024/12/08/398857-t.webp)
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం పేరెంట్స్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా టీనేజ్ పిల్లల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే.. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. పిల్లలు పెరుగుతున్న కొద్ది వాళ్ల శరీరంలోని హర్మోన్ల మార్పులు వారికి చిరాకు, కోపంను కలిగిస్తాయి. పిల్లలు ఎదిగేకొద్ది వారు ప్రశ్నించడం కూడా మొదలుపెడతారు. కాబట్టి పేరెంట్స్ తగిన కేర్ తీసుకోకపోతే భవిష్యత్‌లో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.అలా జరగకూడదంటే పిల్లల విషయంతో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.
చక్కగా చదువుకుంటూ.. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా కడపాల్సిన పిల్లలు ఈ మధ్య పూర్తిగా మారిపోతున్నారు. పెద్దల్ని గౌరవించకుండా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా పెడచెవిన పెట్టడం వంటివి చాలామంది టీనేజర్లలో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ వయస్సులోని పిల్లల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
ఓపికగా వినండి: టీనేజర్లు వారికి సంబంధించిన అన్నీ విషయాల గురించి పేరెంట్స్‌కి చెప్పడానికి సందేహిస్తుంటారు. అందుకే వారిని అర్థం చేసుకోవాలి. వారితో ఫ్రెండ్లీగా ఉండాలి. కాస్త ఓపికగా వారు చెప్పింది వినాలి. సమస్యల ఏదైనా సరే దాన్ని పరిష్కరిస్తామని భరోసా కల్పించాలి. అలా అని పెద్ద పొరపాటులకు తావివ్వకూడదు. పిల్లలకు కోపం వల్ల కలిగే నష్టం గురించి తెలియజేయాలి. దాన్ని ఎలా అధిగమించి, సామరస్యంగా ఎలా మెలగాలో నేర్పించాలి.
వాదన వద్దు: టీనేజ్‌లో పిల్లలకు కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ చిన్ని విషయానికి వారు ఎక్కువగా కోపడుతుంటారు. ఈ కోపం అనర్థాలకు తావిస్తుంది. అందుకే పిల్లల కోపానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంను పేరెంట్స్ చేయాలి. కొన్ని విషయాల్లో పిల్లలతో కఠినంగా మాట్లాడుతుంటారు. ఇది వాళ్ల మనసును నొప్పిస్తుంది. గొడవకు కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
అర్థమయ్యేలా చెప్పాలి: టీనేజర్లు వారికి ఎదురైన సమస్యల గురించి చెబుతున్నప్పుడు దానిని పట్టించుకోకుండా ఉండకూడదు. పేరెంట్స్ వాళ్ల సమస్యను తీర్చకపోతే.. వాళ్లలో అసహనం పెరిగి, పేరెంట్స్ అంటే గౌరవం లేకుండా పోతుంది. పేరెంట్స్ ఎప్పుడూ అర్థం చేసుకోరు అనే భావన వారిలో కలుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వారితో ప్రతీ విషయం గురించి చర్చించాలి.
సలహాలివ్వాలి: టీనేజ్ పిల్లలు ఎవ్వరి మాట వినడానికి ఇష్టపడరు. వాళ్లు చేసినదే కరెక్ట్ అని అనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని తిట్టడం లేదా కొట్టడం వంటివి చేయకకూడదు. దీని వల్ల పేరెంట్స్‌కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. అందుకే వాళ్లకి కొంత సమాయన్ని కేటాయించి, మంచి సలహాలు ఇవ్వాలి. అంతేకానీ మీ నిర్ణయాన్ని పిల్లలపై బలవంతంగా రుద్దకూడదు.
మంచి నేర్పించాలి: టీనేజ్ పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉంటారు. వాళ్లని ఎప్పుడూ ప్రోత్సహించండి. పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అనే విషయాల గురించి చిన్నప్పటి నుండే అవగాహన కల్పించాలి. బయటకు వెళ్లినప్పుడు ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలపాలి. సమాజంలో జరిగే సంఘటనలపై పిల్లలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. పెద్ద వాళ్లు, సన్నిహితులను గౌరవించడం నేర్పించాలి.
ఒంటరిగా వదిలేయకూడదు: ఈ రోజుల్లో చాలామంది టీనేజ్ పిల్లలు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. వారిని అలా ఎప్పుడూ వదిలేయకండి. వాళ్లని ఏదో ఒక పనిలో బిజీగా ఉండేలా చేయండి. ఒంటరిగా వారిని వదిలేయడం వల్ల వాళ్లలో మానసిక ఆందోళన కలుగుతుంది.