- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kids and Parenting : పిల్లల అల్లరి భరించలేకపోతున్నారా..? నిపుణుల సూచనలివిగో..!
Kids and Parenting : పిల్లల అల్లరి భరించలేకపోతున్నారా..? నిపుణుల సూచనలివిగో..!

దిశ, ఫీచర్స్ : అసలే వేసవి సెలవులు.. ఆ పైన పిల్లల అల్లరి చేష్టలు.. మొండితనం.. మాట వినకపోవడం వంటివి కొన్నిసార్లు పేరెంట్స్‌కు చికాకు తెప్పిస్తుంటాయి. ఓ విధంగా చెప్పాలంటే ఏడెనిమిదేండ్లలోపు పిల్లలను కంట్రోల్ చేయడానికి మస్తు సఫర్ అవుతుంటారు. ఇక సెలవులనే కాకుండా సాధారణంగా ఉద్యోగాలు, ఉరుకులు, పరుగు జీవితాల నేపథ్యంలో ఈ రోజుల్లో పిల్లల పెంపకం పేరెంట్స్‌కు ఓ సవాల్‌గానూ మారుతోంది. ఇలాంటప్పుడు పేరెంట్స్ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే.. భవిష్యత్‌లో ఇబ్బందుతు ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా టీనేజర్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.
వాళ్లు చెప్పేది కూడా వినండి
పిల్లలు అల్లరి చేస్తుండవచ్చు. ఈ విషయంలో వారిపై కోపం తెచ్చుకోవడం కంటే బాల్యం వాళ్ల హక్కు అని పేరెంట్స్ గుర్తించాలంటున్నారు నిపుణులు. ఒక్కసారి మీ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలిసిపోతుందని సూచిస్తున్నారు. 12 ఏండ్లలోపు పిల్లల్ని కాస్త భయంతో కంట్రోల్ చేయవచ్చు. కానీ టీనేజర్ల విషయంలో ఇది బెడిసి కొట్టవచ్చు. కాబట్టి మరింత కేర్ తీసుకోవాలి. ఎందుకంటే వీరు తమకు సంబంధించిన అన్ని విషయాలను పేరెంట్స్‌కి చెప్పడానికి సందేహిస్తుంటారు. అందుకే తల్లిదండ్రులే వారిని అర్థం చేసుకోవాలి. వారితో ఫ్రెండ్లీగా ఉంటూ ప్రతీ విషయాన్ని మీకు చెప్పగలిగే చొరవ ఉండేలా బిహేవ్ చేయాలి. అంతేగానీ కోపంగానో, కొట్టడంవల్లనో కంట్రోల్ చేయాలంటే పిల్లలు మొండిగా వ్యవహరించే అవకాశం కూడా ఉంటుంది.
ప్రతీ విషయానికి కోపం వద్దు
చిన్న పిల్లలతో వాదన వారికి ఉపయోగపడేలా ఉండాలి. అయితే టీనేజ్‌లో పిల్లల విషయంలో మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ ఏజ్‌లో హార్మోన్ల ప్రభావం కారణంగా కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ చిన్న విషయాన్ని కొన్నిసార్లు సీరియస్‌గా తీసుకొని కోపం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇక్కడ వారిని అణచి వేయాలనో, దండించాలనో కాకుండా పిల్లల కోపానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలంటుననారు నిపుణులు. అంతేగాని పిల్లలతో అనవసర విషయాల్లో ఎక్కువగా వాదించడం, కఠినంగా మాట్లాడుతూ హెచ్చరించడం వాళ్ల మనసును నొప్పిస్తుంది. దీంతో మాట వినకుండా ప్రవర్తిస్తారు. ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
అర్థమయ్యేలా వివరించండి
బాల్యమంటేనే తెలిసీ తెలియని వయసు. టీనేజ్ అయితే ఏమీ తెలియకపోయినా తమకు తెలుసనే భ్రమపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పిల్లలు, ముఖ్యంగా టీనేజర్లు తమకు ఎదురైన సమస్యల గురించి చెబుతున్నప్పుడు పేరెంట్స్ కాస్త శ్రద్ధగా వినాలి. పట్టించుకోకుండా ఉండకూడదు. ఈ సందర్భంలో తల్లిదండ్రులు వాళ్ల సమస్యను వినకపోవడం, పరిష్కారానికి చొరవ చూపకపోవడం, భరోసా ఇవ్వకపోవడం పిల్లల్లో అసహనానికి, కోపానికి దారితీస్తుంది. తమను ఎప్పుడూ అర్థం చేసుకోరనే భావన ఏర్పడుతుంది. ఇలా జరగకూడదంటే.. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. ప్రతీ విషయం గురించి చర్చించండి. ఆర్థిక, కుటుంబ సమస్యల గురించి కూడా వారికి అర్థమయ్యేలా వివరించాలి.
ఓపికగా సలహాలు ఇవ్వండి
టీనేజర్లు చాలా వరకు చెప్పింది వెంటనే రిసీవ్ చేసుకోకపోవడం, మాట వినకపోవడం వంటివి చేస్తుంటారని పేరెంట్స్ అంటుంటారు. ఇది వయసు తెచ్చే మార్పు. తమకు తెలిసిందే. తాము చేసిందే కరెక్ట్ అని భ్రమపడుతుంటారు కొన్నిసార్లు టీనేజర్స్. ఇలాంటప్పుడు వారిని మార్చడానికి తిట్టడం లేదా కొట్టడం వంటివి చేయకూడదు. దీని వల్ల పేరెంట్స్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు కొంత సమాయన్ని కేటాయించి, సామరస్యంగా, ప్రేమ పూర్వకంగా మెలుగుతూ.. మంచి సలహాలు ఇవ్వాలి. అంతేకానీ మీ నిర్ణయాన్ని పిల్లలపై బలవంతంగా రుద్దకూడదంటున్నారు నిపుణులు.






