- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stress : చిన్న వయసులో అధిక ఒత్తిడి.. పెద్దయ్యాక జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుందా?
Stress : చిన్న వయసులో అధిక ఒత్తిడి.. పెద్దయ్యాక జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుందా?

దిశ, ఫీచర్స్ : చిన్న వయసులో తరచుగా ఆందోళనకు గురయ్యే వాతావరణంలో పెరగడం, అధిక ఒత్తిడిని ఎదుర్కోవడం ఆ తర్వాత కాలంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందా?.. అవుననే అంటున్నారు మానసిక నిపుపుణులు. చిన్నప్పుడు స్థాయికి మించిన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి అనుభవాలు మధ్య వయస్సులో గానీ, ఆ తర్వాత గానీ రిపీట్ అయ్యే చాన్సెస్ అధికంగా ఉన్నాయని న్యూయార్క్ సైకాలజిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. ఓల్డ్ ఏజ్‌లో జ్ఞాపక శక్తి తగ్గడానికి అవి కారణం అవుతాయని పేర్కొన్నది.
కారణాలివే..
బిజీ లైఫ్ షెడ్యూల్, వర్క్ ప్రెజర్, పేదరికం, కుటుంబ ఆర్థిక సమస్యలు, పర్సనల్ ప్రాబ్లమ్స్ వంటివి 30 ఏండ్లలోపు వారిలో ఆందోళనకు, ఒత్తిడికి కారణం అవుతున్నాయి. అలాగే 18 ఏండ్లలోపు వారిని చదువుకునే సమయంలో పేదరికం, సామాజిక ఒంటరితనం వంటివి మానసికంగా కృంగదీస్తున్నాయి. కొందరిని డిప్రెషన్‌లోకి నెడుతున్నాయి. దీని ప్రభావంవల్ల వారు మధ్య వయస్సులోనూ, వృద్ధాప్యంలోనూ మానసిక సమస్యలు ఎదుర్కోనే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబతున్నారు.
డిప్రెసివ్ డిజార్డర్
జ్ఞాపక శక్తిని బలహీన పర్చడంలో చిన్న వయస్సులో ఎదుర్కొనే అధిక ఒత్తిడి అనుభవాలు కీలకాపాత్ర పోషిస్తున్నాయని ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్ యూనివర్సిటీ నిపుణులు కూడా చెప్తున్నారు. అధ్యయనంలో భాగంగా వీరు నిద్ర, ఆకలి, ఏకాగ్రత, సోషల్ ఐసోలేషన్, డిప్రెషన్, సామర్థ్యం, విచారం వంటి అంశాలను ఎనలైజ్ చేశారు. ఈ సందర్భంగా యవ్వనంలో డిప్రెషన్‌తో బాధపడినవారు మధ్య వయస్సులో బలహీనమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ డిప్రెసివ్ డిజార్డర్ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండటం లేదు. ఆయా వ్యక్తులు పుట్టి పెరిగిన వాతావరణం, ఒత్తిడిని వారు స్వీకరించి, ఫీలయ్యే విధానాన్ని బట్టి కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. తమ అధ్యయనం వృద్ధాప్యంలో వచ్చే డెమెన్షియాను మరింత విస్తృతంగా అర్థం చేసుకునేందుకు దోహదపడిందని చెబుతున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






