- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒబేసిటీ ఎఫెక్ట్.. పట్టుకోల్పోతున్న ఎముకలు!
ఒబేసిటీ ఎముకలగూడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు వెల్లడించారు. దీనివల్లే ఎముకలు పట్టుకోల్పోతున్నాయని తెలిపారు.

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం చాలామంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అధిక బరువు పెరిగి తీవ్ర అనారోగ్యాల బారిపడుతున్నారు. అయితే తాజాగా డాక్టర్లు మరో భయంకరమైన విషయం బయటపెట్టారు. హెవీ వెయిట్ హార్ట్, షుగర్ వ్యాధులకే పరిమితం కాకుండా ఎముకలగూడు (Skeleton)పై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించారు. మనిషి ఎదుగుదలకు సంబంధించి నిర్ధిష్ట బరువును మోసే ఎముకలు పరిమితికి మించి వెయిట్ మోయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అర్థరైటిస్ అటాక్:
మన కీళ్లలో ‘కార్టిలేజ్’ అనే మెత్తలాంటి కుషన్ ఉంటుంది. అధిక బరువు ఉన్నవారిలో ఇది త్వరగా అరిగిపోతుంది. దీని కారణంగా కీళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా నడిచేటప్పుడు వెన్నుముక, తుంటి, మోకాళ్లపై దాదాపు 3నుంచి 4రేట్ల అధిక ఒత్తిడి పడుతుంది. ఈ క్రమంలోనే కీళ్లలోని మృదులాస్థి (Cartilage) త్వరగా అరిగిపోయి ఆస్టియో అర్థరైటిస్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. పొట్ట భాగంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే వెన్నుముకతోపాటు నడుముభాగంలోని బోన్స్ వంగిపోతాయి. వెన్నుముకలో డిస్క్‌లు స్లిప్ అయితే సయాటికా, తీవ్రమైన నడుమునొప్పి వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు.
రక్త ప్రసరణపై ఎఫెక్ట్:
బాడీలోని హెవీ కొలెస్ట్రాల్ కారణంగా ఎముకలు గుల్లబారే ప్రమాదం ఉంది. దీంతో చిన్న దెబ్బ తగిలినా ఫ్రాక్చర్ కావడం లేదంటే సులభంగా ఇరిగిపోతాయి. పాదాల నొప్పుల కారణంగా నడవడానికి ఇబ్బందిపడతారు. అధికబరువు ఉంటే ఎముకలకు అందాల్సిన రక్త ప్రసరణ సరిగా జరగదు. విటమిన్ డీ, కాల్షియం వంటి పోషకాలు అందవు. దీంతో ఎముకల పునరుత్పత్తి ప్రక్రియ నెమ్మదిస్తుంది. చిన్న వయసులోనే అధిక ఊబకాయం ఉంటే కాళ్లు వంకరగా మారే ప్రమాదం ఉండటంతోపాటు ఎదుగుదలలోనూ తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వయసు, ఎత్తుకు తగ్గట్లుగా బరువు ఉండటమే ఉత్తమని సూచిస్తున్నారు.






