పిండి ముద్దను ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా..? ఇది తెలుసుకోండి!

by Kanadam.Hamsa lekha |   (  Updated:2024-11-30 16:38:03  IST  )

చాలామంది ఫ్రిజ్‌లో.. వండిన కూరలు, కోడిగుడ్లు, కూరగాయలను రోజుల తరబడి పెడుతుంటారు.

పిండి ముద్దను ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా..? ఇది తెలుసుకోండి!
X

దిశ, ఫీచర్స్: చాలామంది ఫ్రిజ్‌లో.. వండిన కూరలు, కోడిగుడ్లు, కూరగాయలను రోజుల తరబడి పెడుతుంటారు. ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహార పదార్థాలన్నింటిని పెడుతుంటారు. ఇలా రోజుల తరబడి అందులో స్టోర్ చేసి ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొందరు పగలు గోధుమ పిండి ముద్ద మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. రాత్రి సమయంలో కూడా పిండి మిగిలిపోతే దాన్ని మరుసటి రోజున ఉపయోగిస్తారు. ఇలా పిండిని స్టోర్ చేసి వాడడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి ఒక్కరూ కూడా శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎప్పటికప్పుడు వేడిగా వండుకుని పదార్థాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. కానీ, ఈ రోజుల్లో చాలామంది ఫ్రిజ్‌లో స్టోర్ చేసిన ఆహార పదార్థాలను వేడి చేసుకుని తింటుంటారు. అలా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. చాలామంది చపాతీ తినేవారు పిండి ముద్దను కలుపుకుని కొద్దికొద్దిగా తీసుకుని చపాతీలు చేసి తింటుంటారు. అలా నీరు కలిపి ఉంచిన పిండి ముద్దలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కి కారణం అవుతుంది. ఇలా స్టోర్ చేసి తినడం వల్ల ఏసిడిటీ, మలబద్ధకం సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే, చాలా వరకు కూడా బ్యాక్టీరియా తక్కువ ఉష్ణోగ్రతలో పెరుగుతుందని అనేక అధ్యయనాలు తెలిపాయి. ఫ్రిజ్‌లో తక్కువ ఉష్ణోగ్రత కారణంగా లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది ఎక్కువగా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలోనే పెరుగుతుంది. అందుకే ఎప్పటికప్పుడూ ఫ్రిజ్‌ను శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ పిండి ముద్దను ఫ్రిజ్‌లో స్టోర్ చేయాలంటే ఒక్క రోజుకి మించి ఎక్కువ రోజులు దీనిని ఉంచకూడదు. గాలి చేరని కంటైనర్‌లో పిండి ముద్దను ఉంచి ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Read More...

Uric acid: యూరిక్ యాసిడ్ కంట్రోల్‌లో ఉండాలా..? ఈ జ్యూస్‌లు బెస్ట్..!



Next Story