- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రుళ్లు లైట్స్ ఆఫ్ చేసి ఎందుకు నిద్ర పోవాలో తెలుసా?
రాత్రి నిద్రపోతున్నప్పుడు కాంతి లేదా మసక వెలుతురు నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.

దిశ, వెబ్ డెస్క్ : రాత్రి నిద్రపోతున్నప్పుడు కాంతి లేదా మసక వెలుతురు నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఈ లైటింగ్ మీ శరీరంలోని స్లీపింగ్ సైకిల్ కు అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత తగ్గిపోయి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. సరిగ్గా నిద్రపోకపోతేనే మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చీకటిలో నిద్రపోవడం వల్లే మెలటోనిన్ హార్మోన్ సరైన మొత్తంలో ఉత్పత్తి అయ్యి త్వరగా నిద్రపడుతుంది. గాఢంగా నిద్రపోయేందుకు ఆస్కారం లభిస్తుంది. మన శరీరానికి పూర్తి విశ్రాంతి దొరికి మరుసటి రోజు ఉదయం మెదడు, శరీరం రిఫ్రెష్ అవుతాయి. మంచి నిద్ర ఉంటే ఒత్తిడి తగ్గి మనసు తేలికపడుతుంది. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. ఇంకా చీకట్లో పడుకునే ముందు వీలైతే మీరు ధ్యానం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనస్సును, శరీరాన్ని ఒక తాటిపైకి తెచ్చేందుకు ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిముషాల్లోనే నిద్రపోయేందుకు ఇదొక చక్కటి మార్గం.
ఇవి గుర్తుంచుకోండి?
మంచి నిద్ర కోసం పడుకునే ముందు గదిలోని అన్ని లైట్లు ఆపివేయండి. టీవీ, మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఆఫ్ చేసి దూరంగా పెట్టండి. ఎందుకంటే వాటి నుండి వెలువడే బ్లూ లైట్ నిద్రకు భంగం కలిగిస్తుంది. ఇదే కాకుండా మంచి నిద్ర కోసం వాతావరణానికి అనుగుణంగా గది ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోండి. తేలికపాటి పూల సువాసన, హాయిగొలిపే సంగీతం మంచి నిద్ర పొందడానికి చక్కగా సహాయపడతాయి.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడినది. దిశ దీనిని ధృవీకరించలేదు. ఇది కేవలం మీ అవగాహన కోసం అందిస్తున్న సమాచారం మాత్రమే. పై వార్తలో ఏవైనా సందేహాలు ఉంటే నిపుణుల సలహా తీసుకోగలరు.






