రైలులో సీట్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా?

by Mallepaka Hamsa |

చాలా మంది ట్రైన్‌లో తమ సొంత ఊర్లకు ప్రయాణిస్తుంటారు. అయితే రైల్లో సీట్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి.

రైలులో సీట్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది ట్రైన్‌లో తమ సొంత ఊర్లకు ప్రయాణిస్తుంటారు. అయితే రైల్లో సీట్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి. అయితే ఎన్నో రంగులు ఉన్నా నీలం రంగులోనే ఎందుకు ఉంటాయనే అనుమానం చాలా మందికి వచ్చే ఉంటుంది. దాని వెనక ఒక బలమైన కారణం ఉండటం వల్ల నీలం రంగు సీట్లను ఉంచుతారట. ప్రయాణం అనగానే అందరికీ హడావిడిగా మొదలవుతుంది. టైం కి రీచ్ అవుతామా లేదా సీట్లు ఖాళీగా ఉంటాయో లేదోనని కంగారు పడుతుంటారు. దీని వలన ఒత్తిడికి గురి అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే ఆ ఒత్తిడి తగ్గి చుట్టు పక్కల ప్రశాంతత వాతావరణం ఏర్పడటానికి బస్సుల్లో, ట్రైన్‌లో సీట్లను నీలం రంగులో ఉంచుతారు. టోక్యో నగరంలో ఏకంగా దీపాలను కూడా నీలం రంగులోకి మార్చారట. దీంతో అక్కడ నేరాలు తగ్గిపోయి జనాలు ప్రశాంతంగా ఉంటున్నారట.

Next Story