Shopping Malls: షాపింగ్ మాల్స్ కి కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా?

by Phanindra |

అక్కడ ఫుడ్ దగ్గర నుంచి షాపింగ్ ( Shopping ) వరకు అన్ని ఒకేచోట ఉంటాయి

Shopping Malls: షాపింగ్ మాల్స్ కి కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : వారంలో ఆరు రోజలు పని చేసి ఆదివారం రోజున అందరూ సరదాగా బయటకు వెళ్తుంటారు. ఎవరికీ వారు ఫ్యామిలీ ( Family ) , ఫ్రెండ్స్ ( Friends) తో కలిసి మాల్స్ కి వెళ్తుంటారు. ఎందుకంటే, అక్కడ ఫుడ్ దగ్గర నుంచి షాపింగ్ ( Shopping ) వరకు అన్ని ఒకేచోట ఉంటాయి. ఒక్కసారి షాపింగ్ మాల్‌ లోకి అడుగు పెట్టిన తర్వాత సమయం మనకి తెలియకుండానే గడిచిపోతుంది. మీరు ఉదయం మాల్‌లోకి వెళ్తే.. మీరు బయటకు వచ్చేసరికి చీకటి అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా .. దీనికి ప్రధాన కారణం షాప్స్ కి కిటికీలు లేకపోవడం.

మాల్స్ లో ఉండే కృత్రిమ లైటింగ్‌ కు అందరూ ఫిదా అవుతారు. ఇక్కడ మనకి తెలియని విషయం ఏమిటంటే .. పగటిపూట లైట్స్ వేయకపోతే ఎంత కాంతి వస్తుందో .. మాల్స్ లో ఉండే లైట్స్ ను అలాగే డిజైన్ చేస్తారు.అందువలన, మీకు సాయంత్రం సమయంలో కూడా పగటిపూట లాగే కలిగిస్తుంది. ఇది మనల్ని ఎక్కువసేపు షాపింగ్ మాల్ లోపల ఉండేలా చేస్తుంది. అలాగే ఎక్కువ షాపింగ్ కూడా చేయిస్తుంది.. మొత్తానికి ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేలా చేయిస్తుంది.

తక్కువ కిటికీలు ( windows ) ఉష్ణోగ్రత నియంత్రణను సులభతరం చేస్తాయి. అలాగే, కరెంట్ బిల్లులు కూడా తగ్గుతాయి. అందుకే, చిన్న చిన్న దుకాణాల్లో వారు కూడా ఇదే ఫాలో అవుతారు. అక్కడ కూడా తక్కువ కిటికీలు పెట్టి.. ఒక లైట్ , ఫ్యాన్ మాత్రమే వాడతారు. అలాగే, రిఫ్రిజిరేటెడ్ వస్తువులను ఈజీగా పెట్టొచ్చు. మాల్ ఉండే మొక్కలు, మెరుస్తున్న షాప్స్ అందర్ని ఆకర్షిస్తాయి. దీంతో, జనాలు మాల్‌లో ఎక్కువసేపు ఉంటారు. వచ్చిన పని అయిపోయిన తర్వాత కూడా మాల్ లోనే టైమ్ స్పెండ్ చేస్తుంటారు.

Next Story