పూల మాలలో ఈ ఆకును ఎందుకు వాడుతారో తెలుసా..?

by Disha Web Desk 7 |
పూల మాలలో ఈ ఆకును ఎందుకు వాడుతారో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : పువ్వులు సాగు చేయడం సర్వసాధారణం. కానీ, వినూత్నంగా ఆలోచించి పువ్వుల అల్లికలో వాడే ఆకును కూడా సాగు చేస్తున్నారు. ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సాగు జరుగుతోంది. దగ్గు నయం చేయడం, ఆయిల్ తయారు చేయడంతో పాటు పువ్వుల దండలో విరివిగా వాడుతున్న ఆకు మాచిపత్రి. ఈ ఆకును శుభకార్యాల్లో డెకరేషన్కు వాడుతున్నారు. గజ మాలల తయారీలో ఉపయోగిస్తున్నారు.

దీంతో ఈ సాగు చేస్తున్న రైతులు కొంత వరకు లాభాలు పొందుతున్నారు. దీన్ని ప్రధాన పంటతో పాటు అంతర పంటగా కూడా సాగు చేయవచ్చు. ఈ విత్తనాలను ఒక్కసారి నాటుకుంటే దాదాపు నాలుగేళ్లు దిగుబడి వస్తుంది. మనం పంట కోసే కొద్దీ మొక్క ఎదుగుతుంది. ఈ మొక్కలను కోసి కట్టలు కడతారు. ఒక్కో కట్టకు ధర రూ.2-3 వరకు అమ్ముతారు. పంట కోసిన వెంటనే నీరు పెట్టడం ప్రారంభిస్తే నెలరోజులకే తర్వాతి పంట చేతికి వస్తుంది.

మాచిపత్రి మొక్కను ఒక్కసారి నాటి కలుపు, చీడలను నిర్మూలిస్తే దాదాపు పదేళ్ల వరకు మొక్క నుంచి దిగుబడి పొందవచ్చు. పంటను కోసే కొద్దీ మొక్క ఎదిగి దిగుబడి పెరుగుతుంది. దానిమ్మ, మల్లె, బొప్పాయి, మామిడి వంటి తోటల్లో సాగు చేయడం ద్వారా నేలకు సారంతో పాటు అదనంగా ఆదాయం పొందే వీలుంటుంది. రైతులకు కూడా ఆదాయ వనరే. నెలకు దాదాపు రూ.40-50 వేల వరకు ఆదాయం వస్తుంది

Also Read...

ఈ మొక్కతో పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెంచుకోండి..!


Next Story

Most Viewed