- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనుషులపై ఈగలు ఎందుకు వాలుతాయో తెలుసా?
ఈగలు ఉండటం అనేది చాలా కామన్. ప్రతీ ఒక్కరి ఇంట్లో ఈగలు ఉంటాయి. అయితే ఎక్కువగా ఆహార పదార్థాల మీద ఈగలు వాలుతుంటాయి. కానీ మనుషుల మీద కూడా ఈగలు అనేవి వాలుతాయి.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఈగలు ఉండటం అనేది చాలా కామన్. ప్రతీ ఒక్కరి ఇంట్లో ఈగలు ఉంటాయి. అయితే ఎక్కువగా ఆహార పదార్థాల మీద ఈగలు వాలుతుంటాయి. కానీ మనుషుల మీద కూడా ఈగలు అనేవి వాలుతాయి. అసలు అవి మనుషుల మీద ఎందుకు వాలుతాయా అని చాలా మందిలో డౌట్ ఉంటుంది.కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనుషుల చర్మంపై కొంత నూనె, ఉప్పు, మృత కణాలుంటాయి. ఈగలు కేవలం ఇళ్లలో కనిపించే ఆహారం మాత్రమే తినవు. మానవ శరీరంపై ఉండే.. కంటికి కనిపించని వ్యర్థాలు కూడా వాటికి ఆహారమే. అందుకే వాలుతుంటాయి. ఆ సమయంలో మనం చిరాకుతో వాటిని చంపడానికి యత్నించినా సులభంగా తప్పించుకుంటాయి. వాటి తీక్షణమైన కళ్లతో ప్రమాదాన్ని ముందే పసిగట్టి 100 మిల్లీ సెకండ్లలోనే ఎగిరిపోతాయట. ఈగలు ఎక్కడ వాలినా కళ్లతో ఆ పరిసరాలను నిశితంగా గమనిస్తూ ఉంటాయి.
Read More: రోజూ చపాతీ తినడం వలన ఎన్ని లాభాలో తెలుసా?
Next Story






