ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి ప్రేమించిన ఆ లక్కీ బాయ్ ఎవరో తెలుసా..?

by Nagaya |
ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి ప్రేమించిన ఆ లక్కీ బాయ్ ఎవరో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కాట్ర ఆమ్రపాలి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందింది. విశాఖపట్నానికి చెందిన ఆమ్రపాలి 2010లో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష రాసి ఐఏఎస్‌ అయ్యారు. వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా పని చేసిన సమయంలో ఆమ్రపాలి రాష్ట్ర ప్రజల దృష్టిని బాగా ఆకర్శించారు. తన డైనమిజంతో వ్యూహత్మక నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధిని పరుగులు పెట్టించారు ఆమె. అతి చిన్న వయసులో ఐఏఎస్ ఆఫీసర్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి యూత్ ఫాలోయింగ్‌ను సంపాధించింది. అందంలోనూ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న ఆమ్రపాలి యూత్ ఐకాన్‌గా మారారు.

తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాల్లో విధులు నిర్వహించిన ఆమ్రపాలికి ఓ లవ్ స్టోరీ ఉంది. ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. అతడు 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మ. జమ్ముకు చెందిన ఈ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆమ్రపాలి ప్రేమించుకోవడంతో ఇరు కుటుంబ సభ్యులు 2018 ఫిబ్రవరి 18న వీరి వివాహాన్ని ఘనంగా జరిపించారు. అతి కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య వీరి ప్రేమ వివాహం అరంరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత ఆమ్రపాలి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లి ఢిల్లీలో విధులు నిర్వహించింది. ఇటీవలే ఆమె తిరిగి తెలంగాణ కేడర్‌కు బదిలీపై వచ్చి హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా, ఈ యంగ్ ఐఏఎస్, ఐపీఎస్‌ల పెళ్లై ఆరేళ్లు అయిన సందర్భంగా ఈ వార్త మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed