- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆడవారికి ఏ కన్ను అదిరితే మంచి జరుగుతుందో తెలుసా?
మనకు కొన్ని సార్లు కుడి కన్ను అదిరితే, ఇంకొన్ని సార్లు ఎడమ కన్నుఅదురుతూ ఉంటుంది. అయితే ఆడవారికి కుడికన్ను అదిరితే చెడు జరుగుతుంది. ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుంది

దిశ, వెబ్‌డెస్క్ : మనకు కొన్ని సార్లు కుడి కన్ను అదిరితే, ఇంకొన్ని సార్లు ఎడమ కన్నుఅదురుతూ ఉంటుంది. అయితే ఆడవారికి కుడికన్ను అదిరితే చెడు జరుగుతుంది. ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుంది అంటారు.అయితే ఇప్పుడు మనం అసలు ఆడవారికి ఏ కన్ను అదిరితే ఏం జరుగుతుంది. ఇందులోని ఫ్యాక్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దగ్గర ఉన్న నమ్మకాలను బట్టి అది ఆధారపడి ఉంటుందని అంటుంటారు కొందరు.మంచి, చెడులను తెలియజేయడానికి కున్ను కొట్టుకుంటోందా? లేదంటే శరీరంలో ఏదైనా సమస్యవల్లా అనేది కూడా మనం తెలుసుకోవాలి. చైనా కంటి శాస్త్ర ప్రకారం ఆడవారికి ఎడమ కన్ను అదిరితే గొప్ప వ్యక్తి ఇంటికొస్తారని, కుడికన్ను అదిరితే పార్టీకి ఆహ్వానం లభిస్తుందని భావిస్తారు. అర్థరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు కన్ను అదిరితే కంగారు పడేపనేదో జరుగుతుందని, కుడికన్ను అదిరితే ఎవరో మీ గురించి ఆలోచిస్తున్నారని, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల మధ్య సమయంలో అదిరితే అనుకున్న పనులు పూర్తికావడంతోపాటు చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయనే నమ్మకం ఉంది.
Also Read...






