ఓలా, ఉబర్ డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చేస్తే ఏం చేయాలో తెలుసా?

by Dishanational2 |
ఓలా, ఉబర్ డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చేస్తే ఏం చేయాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ప్రయాణం చేయాలంటే అరచేతిలో స్మార్ట్ ఫొన్ ఉంటే సరిపోతుంది. బస్ కోసం వేయిట్ చేయాల్సిన పని లేదు, ఆటోల్లో ఎక్కువ మందితో ఇబ్బంది పడాల్సిన పనిలేదు. చేతిలో ఉన్న ఫొన్‌తో ఈజీగా మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.

అలా ఎలా అంటే మనకు ఇప్పుడు అందుబాటులో ఊబర్, ఓలా ఉన్నాయి. మనం ఆఫీసుకు వెళ్లాలన్నా, ఏదైనా అత్యవసర పని మీద బయకు వెళ్లాలన్న వీటిని బుక్ చేసుకుంటే సరిపోతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు మనం బుక్ చేసుకున్నాక, క్యాన్సిలేషన్ అనే సమస్య ఎదురవుతూ ఉంటుంది.మనం ఆటో లేదా బైక్ బుక్ చేసుకున్నాక, రైడ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే, క్యాన్సలేషన్ లేదా, డ్రైవర్సే ఫొన్ చేసి క్యాన్సల్ చేయమనడం లాంటివి చేస్తుంటారు. అయితే ఒకసారి బుక్ అయిపోయిన రైడ్ ను కాన్సల్ చేయడం అనేది వినియోగదారుల హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కన్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) పేర్కొంది.దీనితో ఈ కాన్సలేషన్ సమస్య లేకుండా ఉండడం కోసం ఓలా “ప్రైమ్ ప్లస్” ఫీచర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ కండిషన్ లో ఉంది. ఈ ఫీచర్ లో బెస్ట్ డ్రైవర్లతో పాటు కాన్సలేషన్ లేకుండా ఉండేలా సర్వీస్ తీసుకురానున్నట్లు ఓలా సీఈఓ పేర్కొన్నారు. మరో వైపు ఊబర్ కూడా రైడ్ కి ముందే కస్టమర్లు ఏ రూపంలో డబ్బు చెల్లిస్తారో తెలిసేలా ఫీచర్ తీసుకొస్తోంది. దీనివలన డ్రైవర్లు ముందుగానే చూసుకుని రైడ్ యాక్సెప్ట్ చేస్తారు. దీనితో క్యాన్సిలేషన్లు తగ్గుతాయని ఊబర్ భావిస్తోంది

Read More: అక్కడ వివాహానికి ముందు వరుడు, వధువుకు లోదుస్తులు కొనివ్వాల్సిందే.. లేదంటే పెళ్లిలోనే అలా



Next Story

Most Viewed