వింతగా అనిపించే భారత దేశ ఆచారాలు ఇవే..!

by Batti.Sumithra |

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు.. మరెన్నో ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ప్రాంతాలను బట్టి ఆయా సంస్కృతులు మారుతుంటాయి.

వింతగా అనిపించే భారత దేశ ఆచారాలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు.. మరెన్నో ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ప్రాంతాలను బట్టి ఆయా సంస్కృతులు మారుతుంటాయి. కానీ కొన్ని సాంప్రదాయాలు, ఆచారాల గురించి విన్నా, లేదా ఎక్కడయినా చూసినా వింతగా అనిపిస్తుంది. ఇదెక్కడి ఆచారంరా బాబూ అనిపిస్తుంది. అలాగే మన భారతదేశంలో పాటించే కొన్ని ఆచారాలను విదేశీయులు చూసినప్పుడు వారు కూడా అలాగే ఆశ్చర్యపోతారు. మరి విదేశీయులు అంతగా ఆశ్చర్యపడే అంత వింత ఆచారాలు మనదేశంలో ఏమున్నాయబ్బా అనుకుంటున్నారా. అయితే ఆ పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్యాస్ట్ సిస్టమ్ : విదేశాల్లో చూసుకుంటే క్లాస్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ మన భారతదేశంలో లాగా క్యాస్ట్ సిస్టమ్ ఉండదు. కానీ మనభారత దేశం మాత్రం సర్వమత సమ్మేళనం. ఆ మతాల్లో కూడా వివిధ కులాలు ఉన్నాయి. మనదగ్గర కులభేదం ఉంటే విదేశాల్లో మాత్రం స్థాయి భేదం ఉంటుంది.

డ్రై డే : భారత్ లో గాంధీ జయంతి రోజున అలాగే కొన్ని ముఖ్యమైన పండగల రోజన ప్రభుత్వం వైన్ షాపులకు సెలవు ప్రకటిస్తుంది. కానీ విదేశాల్లో అలా ఉండదు అక్కడి వైన్స్‌కి పబ్లిక్ హాలిడేస్ అస్సలు ఉండవు.

తల్లిదండ్రులతో పిల్లలు కలిసి ఉండటం : కొన్ని విదేశాలలో పిల్లలకు ఇక వయస్సు వచ్చిందంటే చాలు పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండరు. పండగలకో, ఫంక్షన్లకో మాత్రమే కలుస్తుంటారు. కానీ మనదేశంలో మాత్రం పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఈ విషయం కూడా విదేశీలకు కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కాళ్లను మొక్కి ఆశీస్సులను తీసుకోవడం : భారతీయులందరూ తూచా తప్పకుండా పాటించే ఆచారం ఏంటంటే పెద్దవారి కాళ్లను మొక్కి ఆశీస్సులు తీసుకోవడం. అలా ఆశీస్సులు తీసుకునే సమయంలో పెద్దవారు మన తల పై చేయి పెట్టి దీవిస్తుంటారు. కానీ విదేశాల్లో పెద్దలను ఇలా ప్రత్యేకంగా గౌరవించే ఆచారం ఉండదు. ఒక హగ్ ఇవ్వడం వారి ఆచారం. మరి ఇది వారికి వింతగానే అనిపిస్తుంది కదా.

నీటితో శుభ్రం చేసుకోవడం : భారత్ లో టాయిలెట్‌కు వెళ్లినప్పుడు ఖచ్చితంగా నీటిని వాడతారు. కానీ చాలావరకు విదేశాల్లో టాయిలెట్‌కు వెళ్తే టాయిలెట్ పేపర్ వాడి శుభ్రం చేసుకుంటారు. మన భారత్ లో పేపర్లు వాడటం అంటే వింత, అలాగే విదేశాల్లో నీటిని వాడి శుభ్రం చేసుకోవడం వింత. మన ఆచారాలు సాంప్రదాయాలు విదేశీయులకు ఎంత వింతగా అనిపిస్తాయో అలాగే విదేశీయుల కొన్ని పద్ధతులు మన భారతీయులకి కూడా ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Next Story