Snakes: ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఉందని తెలుసా..! ఎక్కడో కాదు మనదేశంలోనే..

by Kavitha |   ( Updated:2024-07-24 09:02:56.0  )
Snakes: ఒక్క పాము  కూడా కనిపించని రాష్ట్రం ఉందని తెలుసా..! ఎక్కడో కాదు మనదేశంలోనే..
X

దిశ, ఫీచర్స్: సుమారు కొన్ని లక్షల ఏళ్ల నుంచి భూమి మీద నివసిస్తున్న అతి పురాతనమైన సరీసృపాలలో పాములు ఒకటి. ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల పాములు ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి మాత్రం కొన్నే. అయితే పాముల్లో విషం లేనివి కొన్ని ఉంటే విషం ఉన్నవి మాత్రం చాలానే ఉంటాయి. కొన్ని కరిస్తే విరుగుడు కూడా ఉండనంత డేంజర్‌ ఉన్న పాములు కూడా ఉన్నాయి. అయితే మన దేశంలో సుమారు 350 రకాల పాములు ఉండగా.. మన కంట్రీలో అత్యధిక పాములు ఉన్న రాష్ట్రం మాత్రం కేరళ. ఇక్కడ దేశంలో ఎక్కడా కనిపించని అత్యంత విషపూరితమైన పాములు మనకు కనిపిస్తాయి. ఇక మన దేశంలో దాదాపు ప్రతి చోట పాములు కనిపిస్తునే ఉంటాయి. అయితే, ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఉందని.. అది కూడా మన భారతదేశంలోనే ఉందని మీకెవరికైనా తెలుసా.? వివరాల్లోకి వెళితే..

భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఒక్క పాము కూడా కనిపించదు. దీంతో దేశంలో పాములు కనిపించని పాము రహిత రాష్ట్ర హోదాను లక్షద్వీప్‌ పొందింది. అలాగే ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. అదేమిటంటే? ఇక్కడ పాములే కాకుండా కుక్కలు కూడా కనిపించవు. అంటే పాములు, కుక్కలు లేని రాష్ట్రంగా లక్షద్వీప్ గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే ఇక్కడ పాములు, కుక్కలు లేకుండా చేయాలని ఇక్కడి పరిపాలన విభాగం పర్యాటకులు సైతం ఇక్కడకు కుక్కలను తీసుకురాకూడదు అని రూల్ కూడా పెట్టింది. దీని ఫలితంగా ఇక్కడ అవి పూర్తిగా కనిపించకుండా పోయాయని చెబుతారు. అంతే కాదు ఈ ప్రాంతాన్ని రేబిస్‌ రహిత రాష్ట్రంగానూ కూడా పిలుస్తుంటారు.

Advertisement

Next Story

Most Viewed