- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cabbage: క్యాబేజీ ఆకులతో ఆ నొప్పులన్ని పోతాయని తెలుసా..!
మన ఇళ్లల్లో ఉండే కురగాయలతోనే తగ్గించుకోవచ్చు.

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది వారంలో నాలుగు ఐదు రోజులు కూరగాయలను తింటుంటారు. వయసు పై బడిన వారిని పలకరిస్తే చాలు.. మోకాళ్ల నొప్పులతో నడవలేకపోతున్నామని చెబుతారు. వాటిని తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల మందులను వాడుతుంటారు. అయినా కూడా ప్రయోజనం ఉండదు. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వలనే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
అయితే, వాటన్నింటికి మందులొక్కటే పరిష్కారం కాదు.. మన ఇళ్లల్లో ఉండే కురగాయలతోనే తగ్గించుకోవచ్చు. వాటిలో క్యాబేజి కూడా ఒకటి. క్యాబేజీ ఆకులతో మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చని ఓ పరిశోధనలో తేలింది.
కాళ్లు నొప్పులుగా ఉంటే క్యాబేజీ ఆకులను తీసుకుని శుభ్రంగా కడగి, ఆరబెట్టాలి. ఆకు ఆకారం చెదరకుండా చాకుతో ముక్కలుగా కోయాలి. కోసినా ఆ ఆకులను మంచిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే, కొంచం మడతలు పడిన రసం మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ ఆకులను రాత్రి పడుకునే ముందు మోకాలిపై బ్యాండేజీ క్లాత్ లా చుట్టేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తీసివేయాలి. ఇలా ఒక నెలపాటు చేస్తే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.
Read More : ఉల్లిపాయలను అందరూ తినాల్సిందే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?






