Radish: ముల్లంగి తింటే మన శరీరానికి ఎన్ని లాభాలో తెలుసా..?

by Prasanna |
Radish: ముల్లంగి తింటే మన శరీరానికి ఎన్ని లాభాలో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్ : మనం వారంలో ఐదు రోజులు కూరగాయలతోనే వండుకుని తింటాము. వాటిలో ముల్లంగి ( Radish ) కూడా ఒక‌టి. దీనిని ఎక్కువగా సాంబార్ లో వాడుతుంటారు. కొందరు ముల్లంగిని చూడగానే దూరం పెట్టేస్తారు. కానీ, నిజానికి ముల్లంగి వలన మనకి శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. దీన్ని వారంలో ఒక రోజు తీసుకోవడం వలన కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టొచ్చు. ముల్లంగిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్రయోజనాలు క‌లుగుతాయో ఇక్కడ తెలుసుకుందాము..

1. ముల్లంగిలో విట‌మిన్ సి, కాల్షియం, మెగ్నిషియం, ఐర‌న్‌, పొటాషియం, జింక్ వంటి పోష‌కాలు మెండుగా ఉంటాయి. కాబట్టి, దీనిని తినడం వలన రోగనిరోధక శక్తీ పెరుగుతుంది.

2. ముల్లంగిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణ క్రియ పనితీరును మెరుగుపరస్తుంది. అంతే కాదు గ్యాస్‌, అసిడిటీ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే, బ‌రువు కూడా త‌గ్గుతారు.

3. ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడతాయి.

4. వారంలో మూడు సార్లు తింటే గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి.అలాగే, మ‌ధుమేహం ఉన్న‌వారు తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి.

5. హైబీపీ, ఇన్‌ఫెక్ష‌న్లతో బాధపడేవారు ముల్లంగి తింటే ఆ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు. అలాగే లివర్‌లో ఉండే విష ప‌దార్థాలను బ‌య‌టకు వెళ్లేలా చేస్తాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement
Next Story