- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భోజనం తర్వాత ఈ పని చేయండి.. అరగంట జిమ్‌తో సమానం.. మీ సమస్యలన్నీ పరార్
ప్రస్తుత కాలంలో వర్క్ బిజీ వల్ల వ్యాయామం చేయడానికి సమయం ఉండటం లేదు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో వర్క్ బిజీ వల్ల వ్యాయామం చేయడానికి సమయం ఉండటం లేదు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల లాభాలున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడటం, రక్తపోటు తగ్గడం, బరువు తగ్గడం వంటి ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
ఈ ప్రయోజనాల కోసం మీరు రోజులో కచ్చితంగా కేవలం ఐదు నిమిషాలను కేటాయించాలని అధ్యయనాలు చెబుతున్నాయి. తిన్న తర్వాత 5 నిమిషాల నడక మొత్తం మీ ఆరోగ్యానికి శ్రీ రామరక్షగా మారుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఎలాంటి ప్లానింగ్ లేకపోయినా రోజువారీ దినచర్యలో 5 నిమిషాలను కేటాయించినా మీరు మీ ఆయుష్యును పెంచుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు. మరి రాత్రి తిన్న తర్వాత చేసే వాకింగ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం..
షుగర్ రాకుండా చేస్తుంది..
నడక అనేది తక్కువ కష్టంతో కూడిన ఉత్తమమైన వ్యాయామం. ఎలాంటి బరువులెత్తే పనిలేకుండా ఈ చిన్న పనితోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. దీనికి ఎటువంటి పరికరాలు అవసరం లేదు. అన్ని వయసుల వ్యక్తులు దీన్ని చేయడం సురక్షితం. ముఖ్యంగా, రోజంతా ఫిజికల్ గా ఎక్కువగా శ్రమ లేని వారు ఇలా రాత్రి భోజనం తర్వాత 5 నిమిషాల నడక చాలా ఉపయోగపడుతుంది.
బీపీ తగ్గుతుంది..
మొదట 2 నుండి 5 నిమిషాల చిన్న నడకతో ప్రారంభించండి. ఎంతసేపు నడిచాం అనేదానికన్నా ఎంత ఎక్కువ కాలం ఈ అలవాటు కొనసాగించాం అనేది చాలా ముఖ్యం. భోజనం తర్వాత కేవలం రెండు నిమిషాలు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే రక్తపోటు కూడా తగ్గుతుంది. బరువు తగ్గడంలో, హార్మోన్ నియంత్రణ వల్ల మానసిక స్థితిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
జీర్ణ సమస్యలు దూరమవుతాయి..
భోజనం తర్వాత తేలిక పాటి నడక వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వ్యాయామం కంటే ఎక్కువ ఎఫెక్టివ్ గా తగ్గుతాయని ఓ పరిశోధన సూచిస్తుంది. భోజనం ముగించిన వెంటనే నడవడం ప్రారంభించినప్పుడు ఇన్సులిన్ స్థాయిలు మరింత స్థిరంగా ఉంటాయని, తిన్న తర్వాత 60 మరియు 90 నిమిషాల మధ్య రక్తంలో చక్కెర పెరుగుతుంది కాబట్టి, సరైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు అంటున్నారు.
కడుపు ఉబ్బరానికి..
జీర్ణం కాని ఆహారం తినడం తాగేటప్పుడు బయటి నుంచి కొంత గాలి లోపలికి వెళ్తుంది. జీర్ణవ్యవస్థలో ఈ గ్యాస్ పేరుకుపోయి కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. అందుకే తిన్న వెంటనే నడక.. మీరు తిన్నది పూర్తిగా జీర్ణం అవడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం పెద్ద స్థలం కూడా అవసరం లేదు. మీ వరండాలోనో.. లేదా లిఫ్ట్ వరకో నాలుగు అడుగులు అటూ ఇటూ తేలికగా తిరిగితే సరిపోతుంది. ఇది మీకు మంచి నిద్రకు కూడా ఉపయోగపడుతుంది.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.






