- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్స్ లవర్స్.. ఆ ఫీలింగ్స్‌తో ఆమెనే తలుచుకుంటూ సతమతం అవుతారా..?
ప్రేమ.. ప్యార్.. ఇష్క్.. కాదల్.. పేరు ఏదైనా అనుభూతి ఒక్కటే. కానీ కొందరు మాత్రం ఆ బంధంలోని భావోద్వేగాలను లైట్ తీసుకుంటారు.

దిశ, ఫీచర్స్: ప్రేమ.. ప్యార్.. ఇష్క్.. కాదల్.. పేరు ఏదైనా అనుభూతి ఒక్కటే. కానీ కొందరు మాత్రం ఆ బంధంలోని భావోద్వేగాలను లైట్ తీసుకుంటారు. భాగస్వామిని మోసం చేసి.. వారి మనసులో లోతైన గాయాలను మిగుల్చుతారు. దీనివల్ల ప్రేమను నిజంగా పంచిన వారు డిప్రెషన్‌లోకి వెళ్లే చాన్స్ కూడా ఉంది. అయితే మరి చీటర్స్ మాటేమిటి? వాళ్లకు ప్రియుడు/ప్రియురాలు గుర్తురారా? అంటే.. కచ్చితంగా వస్తారని అంటున్నారు నిపుణులు. వారు కూడా మనుషులేనని.. తాను నమ్మకద్రోహం చేసిన వ్యక్తి గురించి ఆలోచిస్తారని, ఆ జ్ఞాపకాలు వెంటాడుతాయని చెప్తున్నారు. దీని వెనుకున్న సైకాలజీ, దాని నుంచి ఉత్పన్నమయ్యే భావాలను అర్థం చేసుకున్నప్పుడు.. చీటర్స్ తమ ఎక్స్‌ను మిస్ అవుతారో లేదో తెలుసుకోవడం ప్రారంభించవచ్చని అంటున్నారు. ఇంతకీ ఎలాంటి పరిస్థితుల్లో ఎక్స్ గురించి ఆలోచిస్తారో తెలుసుకుందాం.
1. బ్రేకప్ జరిగిన వెంటనే..
విడిపోయిన వెంటనే చీటర్స్ అనేక రకాల భావోద్వేగాలను అనుభవించవచ్చు. తాము చేసిన పనికి అపరాధ భావం వెంటాడుతుండొచ్చు. దీర్ఘకాలిక సంబంధం ముగిసిపోయిందని, తమను కేరింగ్‌గా చూసుకునేవారిని బాధపెట్టామని విచారంతో ఉండొచ్చు. మళ్లీ కలిస్తే బాగుండనే ఆశతో ప్రయత్నించొచ్చు. అయితే ఈ ఎమోషన్స్ తాత్కాలికం కావచ్చు. చీటర్స్‌లో నిజంగా ఈ బంధాన్ని పునరుద్ధరించాలనే ఆలోచన లేకపోవచ్చు.
2. ఒంటరితనాన్ని అనుభవించినప్పుడు..
చీటర్ తన పార్ట్‌నర్‌తో రిలేషన్‌కు గుడ్ బై చెప్పినప్పటికీ.. తను లేని జీవితంలో ఒంటరితనాన్ని అనుభవించవచ్చు. బ్రేకప్ జరిగిన కొత్తలో సింగిల్‌గా ఫ్రీడమ్‌ను ఎంజాయ్ చేస్తుండొచ్చు కానీ ఒంటరిగా ఉండటం అనుకున్నంత ఈజీగా ప్రాక్టికల్‌గా వర్కవుట్ కాదని గుర్తిస్తారు. ముందుకు సాగడానికి సిద్ధంగా లేకుంటే లేదా కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం కష్టంగా ఉన్నట్లయితే.. తమ పాస్ట్ రిలేషన్‌షిప్‌ను రొమాంటిసైజ్ చేయడం ప్రారంభించవచ్చు. ఇది జరిగినప్పుడు తమ ఎక్స్‌ను మిస్ కావొచ్చు.
3. తమ ఎక్స్ మూవ్‌ఆన్ అయినప్పుడు..
తమ మాజీ లవర్‌ను కొత్త వ్యక్తితో కలిసి మూవ్ ఆన్ అవుతుంటే చూసినప్పుడు చీటర్‌లో సంక్లిష్టమైన భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. తనను ఇంకా ప్రేమిస్తున్నట్లయితే.. మోసగాడు ఈర్ష్య, పగతో బాధపడొచ్చు. తనకు బ్రేక్ చెప్పి తప్పు చేశానా అనే ఆలోచనతో ఎక్స్‌ను మిస్ అవుతుంటారు. తనతో గడిపిన జ్ఞాపకాలు ఫార్మర్ పార్ట్‌నర్‌ను మిరింత మిస్ అయ్యేలా చేయొచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో ఎక్స్ తనకు పర్ఫెక్ట్ పార్ట్‌నర్ అని.. జీవితంలో అలాంటి వ్యక్తిని కనుగొనలేనని రియలైజ్ కావచ్చు. చీటర్స్ లోగా ఫీల్ అయినప్పుడు ఇలాంటి ఆలోచనలు రావచ్చు. ముఖ్యంగా మరో వ్యక్తిపై ఆశపడి ఇలా మోసం చేసినప్పుడు.. ఆ పర్సన్ అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు, తన నుంచి ప్రేమ పొందలేనప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ కలగొచ్చు.
చీటింగ్ తర్వాత మోసగాడి ఫీలింగ్..??
ప్రేమించిన వారిని మోసం చేయడం స్వార్థపూరిత చర్యగా భావించబడుతుంది. అయితే చీటర్స్ ఈ బ్రేకప్ తర్వాత అనేక భావోద్వేగాలను అనుభవిస్తారు. ఇవి ఒకరి నుంచి ఒకరికి మారొచ్చు.
కొంతమంది ఉల్లాసంగా ఉండొచ్చు కానీ ఆ స్టార్టింగ్ థ్రిల్ తగ్గిన తర్వాత అపరాధం, అవమానభారాన్ని అనుభవిస్తారు. నమ్మకద్రోహం చేశామని, నిరాశపర్చామని భావిస్తారు. తర్వాత ఏం జరుగుతుంది? భాగస్వామి రియాక్షన్ ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో కొందరు చీటర్స్ ఆందోళన, భయం అనుభవించవచ్చు. ఒత్తిడితో కూడిన ఒకచోట కూర్చోలేని స్థితికి దారితీస్తుంది.
అదే సమయంలో కొంతమంది మోసగాళ్ళు మోసం చేసిన తర్వాత కూడా ఉపశమనం పొందవచ్చు. ఆ బంధం నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నట్లు భావించవచ్చు. ఏదేమైనా మోసం చివరికి సంబంధంపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఇద్దరి జీవితాలపై శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంటుంది.






