- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాదీ ఛాలెంజ్.. ఈ-సైకిల్‌తో ఈ-వేస్ట్ పోరాటం.!
"ఈ-సైకిల్" ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఉద్యమమే చేస్తోంది

దిశ, ఫీచర్స్: హైదరాబాద్‌లోని చిన్న చెరువుల్లో ఈ-వేస్ట్ వ్యర్థాలు పేరుకుపోయి కనిపిస్తుంటాయి. వర్షాలు వచ్చినప్పుడు పొంగిపొర్లి పొర్లు జనజీవనానికి అసౌకర్యంగా మారుతాయి. ఈ పరిస్థితిని చూసినప్పుడు దియా లోకా హృదయం కరిగిపోయింది. తన స్నేహితురాలు సాహితీ రాధతో కలిసి "ఈ-సైకిల్" ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఉద్యమమే చేస్తోంది.
సెమినార్ల నుంచి మొదలై..
వరదలొచ్చినప్పుడు రోడ్ల మీదికి కొట్టుకొచ్చే రబ్బరు.. గ్యాడ్జెట్లు.. బ్యాటరీల మెర్క్యురీ.. ఆర్సెనిక్ వంటి విషాల వ్యర్థాలను చూసి బాధపడేది దియా. పారిశుద్ధ్య కార్మికులు.. పిల్లలు రక్షణ లేకుండా పని చేస్తుంటే చూసిన చలించిపోయింది. సాహితి రాధతో కలిసి ఈ-వేస్ట్‌ను సేకరించడం.. పర్యావరణ కాలుష్యం వల్ల మనకు జరిగే నష్టం గురించి ప్రజలకు తెలియజేయడం.. సురక్షితమైన రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. స్థానికంగా సెమినార్ల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువత భాగస్వామ్యం అయ్యే ఉద్యమంగా మారింది.
10 దేశాల్లో..
స్థాపించిన మూడేళ్లలోనే "ఈ-సైకిల్" అద్భుత పురోగతి సాధించింది. హైదరాబాద్ ఇతర నగరాల్లో రెసిడెన్షల్ కాంప్లెక్స్‌లు.. స్కూల్స్.. కార్పొరేట్ ఆఫీసుల్లో వ్యర్థాల సేకరణ డ్రైవ్‌లు నిర్వహించి 10 వేల కేజీలకు పైగా ఈ-వేస్ట్ సేకరించారు. సేకరణతోనే ఆగకుండా ఉపయోగకరమైన గ్యాడ్జెట్లను పునర్వినియోగం చేసి ప్రభుత్వ స్కూల్స్‌లోని పేద పిల్లలకు డొనేట్ చేస్తున్నారు. 5 వేల మంది యువ ఛేంజ్ మేకర్స్‌కు అవగాహన కల్పించి 10 దేశాల్లో 150 మంది వాలంటీర్లను తయారుచేశారు. సెమినార్లు వేలాది విద్యార్థులకు అవగాహన కల్పించి ఈ-వేస్టేజ్ పట్ల.. పర్యావరణం పట్ల మన బాధ్యత గురించి తెలియజేస్తున్నారు.
డైనా అవార్డు..
దియా చేస్తున్న పనికి గుర్తింపుగా 2024 "డైనా అవార్డు" వరించింది. సామాజిక మార్పు కోం కృషిచేస్తున్న యువతకు ఇచ్చే ఇంటర్నేషల్ గుర్తింపు ఈ అవార్డు. మెటా.. వాల్ స్ట్రీట్ జర్నల్.. యునిసెప్.. ఐఐటీ హైదరాబాద్.. క్రాప్‌బిన్ వంటి సంస్థల మద్దతుతో "ఈ-సైకిల్" సేవలను అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. పర్యావరణం.. ఈ వేస్టేజ్ గురించి యునెస్కో వంటి వేదికలపై పాల్గొని హైదరాబాద్ సత్తా చాటారు. దీంతో "ఈ సైకిల్" ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమంగా మారింది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వీరి సేవల్ని ప్రశంసించి వేస్ట్ మేనేజ్‌మెంట్ పాలసీల్లో భాగస్వామ్యం చేసింది.






